ఒడిశా ఘోర రైలు ప్రమాద ఘటనపై కోహ్లీ తీవ్ర దిగ్భ్రాంతి

స్వతంత్ర, వెబ్ డెస్క్: ఒడిశా రైలు ప్రమాదం దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపిన సంగతి తెలిసిందే. శుక్రవారం రాత్రి హౌరా నుండి చెన్నై వెళ్తున్న కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ అతి వేగంతో ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీకొట్టడంతో పెను ప్రమాదం సంభవించింది. ఈ ఘోర రైలు ప్రమాదంలో ఇప్పటి వరకు దాదాపు 290 మంది వరకు చనిపోగా.. మరో 1000 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. యావత్ దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిన ఈ ఘటనపై పలువురు రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తంచేస్తున్నారు.

తాజాగా టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కోరమాండల్ రైలు ప్రమాద ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం వార్త విని బాధపడ్డాను. ప్రియమైన వారిని కోల్పోయిన బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను’ అని కోహ్లీ ట్వీట్ చేశారు. మరోవైపు ఈ ప్రమాదంలో గాయపడిన వారి సంఖ్య ఎక్కువగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

Latest Articles

సర్కారు బాయి సినిమా నుంచి బర్త్ డే పోస్టర్ రిలీజ్

శ్రీరామ్ నిమ్మల, వర్షిక హీరో హీరోయన్స్ గా నటిస్తున్న సినిమా "సర్కారు బాయి". ఈ చిత్రాన్ని డెక్కన్ ఫిలింస్ సమర్ఫణలో ప్రొడ్యూసర్ తుమ్మల ప్రఫుల్ రాం రెడ్డి నిర్మిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
425,369SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్