28.7 C
Hyderabad
Thursday, May 14, 2026
spot_img

విజయ్ దేవరకొండ-శ్రీలీల సినిమా ఆగిపోలేదు!

రౌడీస్టార్ విజయ్ దేవరకొండ, యంగ్ బ్యూటీ శ్రీలీల జంటగా డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి ఓ సినిమాను రూపొందిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై రానున్న ఈ చిత్రం #VD12 పేరుతో ప్రచారంలో ఉంది. ఈ చిత్రం పూజా కార్యక్రమం జరిగి 8 నెలలైంది. అయితే ఇప్పటి వరకూ ఎలాంటి అప్‌డేట్ రాకపోవడంతో ఈ సినిమా ఆగిపోయిందంటూ పుకార్లు మొదలయ్యాయి. బడ్జెట్ కారణంగా ఈ ప్రాజెక్ట్ నిలిచిపోయిందని వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై విజయ్ దేవరకొండ టీమ్ క్లారిటీ ఇచ్చింది. ఆ వార్తలు నమ్మొద్దని టీమ్ ప్రకటించింది.

విజయ్‌ దేవరకొండ ప్రస్తుతం ‘ఫ్యామిలీ స్టార్‌’ సినిమాతో బిజీగా ఉన్నారని.. అది పూర్తయ్యాక ఈ సినిమా షూటింగ్‌ మొదలవుతుందని వెల్లడించింది. మార్చి మొదటి వారంలో సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశమున్నట్లు తెలిపింది. విజయ్ దేవరకొండ గూఢచారిగా కనిపించనున్న ఈ చిత్రానికి అనిరుధ్‌ సంగీతం అందిస్తున్నారు. యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో శ్రీలీల విభిన్నమైన పాత్ర పోషిస్తోందని తెలుస్తోంది. ప్రస్తుతం విజయ్‌ దేవరకొండ ‘ఫ్యామిలీ స్టార్‌’ షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే న్యూయార్క్‌లో ఒక షెడ్యూల్ పూర్తయింది. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రంలో మృణాల్ ఠాకూర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ పూర్తవగానే విజయ్-శ్రీలీల చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది.

Latest Articles

అక్కినేని అభిమానులకు.. ఇక పండగే..

అక్కినేని హీరోలు నాగార్జున, నాగచైతన్య, అఖిల్.. షూటింగ్లో బిజీగా ఉన్నారు. క్రేజీ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. అయితే.. అఖిల్ సినిమా లెనిన్ పై క్లారిటీ వచ్చింది కానీ.. నాగార్జున,...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్