Free Porn
xbporn
28.2 C
Hyderabad
Thursday, September 12, 2024
spot_img

వరుణ్ సందేశ్ ‘విరాజి’ మూవీ రివ్యూ

తారాగణం: వరుణ్ సందేశ్, రఘు కారుమంచి, ప్రమోదిని, బలగం జయరామ్, వైవా రాఘవ, రవితేజ నన్నిమాల, కాకినాడ నాని, ఫణి ఆచార్య, అపర్ణాదేవి, తదితరులు
నిర్మాత: మహేంద్ర నాథ్ కూండ్ల
దర్శకత్వం: ఆద్యంత్‌ హర్ష
సంగీతం: ఎబినేజర్‌ పాల్‌(ఎబ్బి)
సినిమాటోగ్రఫీ: జి.వి. అజయ్ కుమార్
ఎడిటర్‌: రామ్‌ తూము
విడుదల తేది: 02/08/2024

‘నింద’ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన వరుణ్ సందేశ్ ప్రధాన పాత్రలో ఆద్యంత్ హర్ష దర్శకత్వంలో మహేంద్ర నాథ్ కూండ్ల నిర్మించిన సినిమా ‘విరాజి’. ఈ సినిమాలో వరుణ్ సందేశ్ లుక్ డిఫరెంట్‌గా ఉండడంతో అందరి దృష్టిని ఆకర్షించింది. మహా మూవీస్ – ఎమ్ 3 మీడియా బ్యానర్లపై తెరకెక్కిన ఈ సినిమా టీజర్, థియేట్రికల్ ట్రైలర్ ఒక్కసారిగా సినిమా మీద ఆసక్తి పెంచేశాయి. మరి ఈ సినిమా ఎలా ఉంది? ఎంత వరకు ప్రేక్షకులను ఆకట్టుకుంది? అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.

కథ
రకరకాల కారణాలతో సీఐ ప్రభాకర్ (బలగం జయరామ్ ), డాక్టర్ సుధా( ప్రమోదీని), స్టాండ్ అప్ కమెడియన్ వేద( కుశాలిని), సినిమా నిర్మాత కోదండరాం(కాకినాడ నాని), సెలబ్రిటీస్ ఆస్ట్రాలజిస్ట్ రామకృష్ణ( రఘు కారుమంచి), ఫోటోగ్రాఫర్ కాన్సెప్ట్ రాజు( రవితేజ నన్నిమాల) తో పాటు మొత్తం పదిమంది కొండమీద ఉన్న పాడుబడ్డ బంగ్లాలోకి వస్తారు. అక్కడికి వచ్చిన తర్వాత వారందరూ మోసపోయి ఇక్కడికి వచ్చామని తెలుస్తుంది. ఈవెంట్ పేరుతో తమను మూసివేయ పడిన పిచ్చి ఆసుపత్రికి వచ్చేలా చేశారని తెలుసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోయేందుకు ప్రయత్నిస్తారు. ఈ క్రమంలో నిర్మాత కోదండరాంతోపాటు ఫోటోగ్రాఫర్ కూడా దారుణ హత్యకు గురవుతారు దీంతో మిగిలిన వారంతా భయపడి ఆ పిచ్చి ఆసుపత్రిలోనే ఉంటారు. ఆ టైంలో ఆండి (వరుణ్ సందేశ్) వారి దగ్గరికి వస్తాడు. ఆండి వచ్చిన తర్వాత ఆ పిచ్చి ఆసుపత్రిలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? అసలు ఈ పదిమందిని ఆసుపత్రికి వచ్చేలా ప్లాన్ చేసింది ఎవరు?ఎందుకు చేశారు? రోడ్డు ప్రమాదంలో చనిపోయిన సాగర్ కు వీళ్లకు మధ్య ఉన్న సంబంధం ఏంటి? చివరకు ఆ ఆ పిచ్చి ఆసుపత్రి నుంచి బయటపడింది ఎవరు? అసలు ఆండి ? ఎవరు అతని నేపథ్యం ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:
సొసైటీలో ఇప్పుడున్న ఒక్క కాంటెంపరరి ఇష్యూస్ ని తీసుకొని, దానికి థ్రిల్లర్స్ సస్పెన్స్ అంశాలను జోడించి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు. సినిమా చివరి వరకు ట్విస్టులేవి రివిల్ చేయకుండా కథనాన్ని ఆసక్తికరంగా సాగించాడు. వేరువేరు నేపథ్యాలు ఉన్న పదిమంది ఒకే చోటికి రావడం.. వారిని అక్కడికి రప్పించిన వ్యక్తి ఎవరనేది తెలియకపోవడంతో.. అతను ఎవరు? ఎందుకు రప్పించారు? అనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో కలుగుతుంది. అయితే ఆ క్యూరియాసిటీని సినిమా క్లైమాక్స్ వరకు కంటిన్యూ చేశాడు డైరెక్టర్.

ఇంటర్వెల్ వరకు సస్పెన్స్, థ్రిల్లర్ జానర్ లో కథనం సాగుతుంది. ఇంటర్వెల్ సీను అదిరిపోవడంతో పాటు సెకండాఫ్ పై ఆసక్తిని పెంచుతుంది. సెకండ్ హాఫ్ లో వచ్చే ట్విస్టులు ఊహించని విధంగా ఉంటాయి. క్లైమాక్స్ లో వరుణ్ సందేశ్ తో వచ్చే సీన్ సినిమాకే హైలైట్. ఆ పదిమంది అక్కడికి రావడానికి గల కారణం ఊహించని విధంగా ఉంటుంది. బరువెక్కిన హృదయంతో ప్రేక్షకు బయటకు వస్తాడు. నిడివి తక్కువ ఉండడం సినిమాకు బాగా కలిసి వచ్చింది.

నటీనటుల పనితీరు:
ఆండీ పాత్రలో వరుణ్ అద్భుతంగా నటించాడు. తెరపై చాలా కొత్తగా కనిపించాడు. తన డిఫరెంట్ గెటప్ సినిమాకు ప్రధాన ఆకర్షణ అని చెప్పొచ్చు. సిఐ మురళిగా బలగం జయరాం చక్కగా నటించారు. సెలబ్రిటీ ఆస్ట్రాలజిస్ట్ రామకృష్ణగా రఘు కారుమంచి తెరపై కనిపించేది కాసేపే అయినా .. ఉన్నంతలో నవ్వించే ప్రయత్నం చేశాడు. ప్రమోదిని, వైవా రాఘవ, రవితేజ నన్నిమాల, కాకినాడ నాని, ఫణి ఆచార్య, అపర్ణాదేవి, కుశాలిని పూలప, ప్రసాద్ బెహరాతో పాటు అందరూ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతిక విభాగం పనితీరు:
టెక్నికల్ టీం విషయానికి వస్తే ఎబెనైజర్ పాల్ నేపథ్య సంగీతం సినిమా మొత్తానికి ప్రాణం పోసింది. తనదైన బిజిఎంతో సినిమాకి ప్రాణం పోశాడు. సినిమాటోగ్రఫీ బాగున్నా కలర్ పేలేట్ ఎంపిక విషయంలో కేర్ తీసుకుని ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఎక్కడా రాజీ పడకుండా సినిమాని తెరకెక్కించారు.

రేటింగ్: 3/5

Latest Articles

రాహుల్ గాంధీపై ఎంపీ ఈటల రాజేందర్‌ తీవ్ర విమర్శలు

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ తీవ్ర విమర్శలు చేశారు. దేశ ప్రజల మీద విశ్వాసం లేని వ్యక్తి రాహుల్ అని ఫైర్ అయ్యారు. ఇక్కడ మాట్లాడే దమ్ము...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్