అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్‌కు ఊహించని షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీ పెద్దలను కలిసేందకు ఆయన గాంధీ భవన్‌కు వచ్చారు. అయితే ఈ క్రమంలోనే ఆయనకు భంగపాటు ఎదురైంది. చంద్రశేఖర్‌రెడ్డిని కలిసేందకు ఏఐసీసీ ఇన్‌చార్జ్ దీపాదాస్ మున్షీ విముఖత వ్యక్తం చేశారు. ప్రస్తుతం నడుస్తున్న పరిణామాల నేపథ్యంలో.. ఆమె కలిసేందుకు ఇష్టపడనట్లు తెలుస్తోంది. దీంతో ఆయన గాంధీ భవన్ నుంచి వెనుదిరిగారు. ఈ సమయంలో మీడియాతో మాట్లాడానికి నిరాకరించిన చంద్రశేఖర్ రెడ్డి.. తాను కాంగ్రెస్‌లోనే ఉన్నానని, పార్టీ నేతలను కలవడానికి వచ్చానని మాత్రం చెప్పి వెళ్లిపోయారు.