TTD: పెళ్లి చేసుకునే వారికి టీటీడీ గుడ్ న్యూస్..!

స్వతంత్ర వెబ్ డెస్క్: పెళ్లి చేసుకునే వారికి టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. నూతన వధూవరులకు తిరుమల శ్రీవారి కల్యాణ తలంబ్రాలు, పసుపు, కుంకుమ, ప్రసాదాలు, కళ్యాణ సాంస్కృతి పుస్తకాన్ని అందించే కార్యక్రమాన్ని టిటిడి పునః ప్రారంభించింది. ఇవి పొందాలంటే మీ పూర్తి అడ్రస్ తో శ్రీ వెంకటేశ్వర స్వామి, EO ఆఫీస్, TTD అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్, కేటీరోడ్, తిరుపతి-517501 అనే చిరునామాకు శుభలేఖ పంపాలి. పెళ్లి ముహూర్తానికి నెల ముందు పంపితే మీకు పోస్టులో వాటిని పంపుతారు. ఇలా కొత్తగా పెళ్లి చేసుకునే వారికి టీటీడీ గుడ్ న్యూస్ చెప్పిందన్న మాట. ఇక అటు తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలు డిసెంబర్ 23 నుంచి జనవరి 1 వరకు కొనసాగనున్నాయి. ఇందుకు సంబంధించి రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు, శ్రీవాణి దర్శనం టికెట్లు, గదులకోటాను టీటీడీ రేపు విడుదల చేయనుంది. ఉదయం 10 గంటలకు 2.25 లక్షల ఎస్ఈడి టికెట్లను ఆన్లైన్లో విడుదల చేస్తారు. శ్రీవారి దర్శన టికెట్లను మధ్యాహ్నం 3 గంటలకు, గదులకోటను సాయంత్రం 5 గంటలకు ఆన్లైన్ లో విడుదల చేయనున్నారు.

Latest Articles

కాంగ్రెస్‌లో మళ్లీ నామినేటెడ్ పదవుల టెన్షన్ మొదలయ్యిందా?

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో నామినేటెడ్ పదవుల టెన్షన్ మళ్లీ మొదలైంది. ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో కార్పొరేషన్ చైర్మన్లుగా అవకాశం దక్కించుకున్న నేతలకు ఇప్పుడు రెన్యువల్ గుబులు పట్టుకుంది. జూలై నెలాఖరుతో వీరి పదవీకాలం...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్