హైదరాబాద్ లో ఐపీఎల్ అభిమానులకు గుడ్ న్యూస్

హైదరాబాద్ లో ఐపీఎల్ అభిమానులకు టీఎస్ఆర్టీసీ చైర్మన్ సజ్జనార్ గుడ్ న్యూస్ చెప్పారు. ఇవాళ రాత్రి ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్-పంజాబ్ కింగ్స్ మధ్య జరగనున్న మ్యాచ్ కోసం అదనపు బస్సులను నడపనున్నట్లు తెలిపారు. నగరంలోని వేర్వేరు ప్రాంతాల నుంచి ఉప్పల్ వెళ్లే మార్గంలో 60 ప్రత్యేక సర్వీసులను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. సొంత వాహనాల్లో వెళ్లి ట్రాఫిక్, పార్కింగ్ సమస్యతో ఇబ్బంది పడకుండా ఆర్టీసీ బస్సుల్లో వెళ్లి సంతోషంగా మ్యాచ్ వీక్షించాలని అభిమానులకు సూచించారు. మరోవైపు మెట్రో అధికారులు కూడా నాగోల్‌ – అమీర్‌పేట మెట్రో మార్గంలో కూడా అదనంగా రైళ్లు నడుపుతామని ప్రకటించారు. రాత్రి 12.30 గంటలకు చివరి రైలు నడవనుందన్నారు. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

Latest Articles

పులివెందులను కాపాడుకోవడానికి వైఎస్ జగన్ ఏం చేయబోతున్నారు?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ చర్చనీయాంశంగా ఉండే పులివెందుల నియోజకవర్గం ఇప్పుడు మళ్లీ వార్తల్లో నిలుస్తోంది. దశాబ్దాలుగా వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ఉన్న ఆ గడ్డపై, ఇప్పుడు ఆధిపత్య పోరు రసవత్తరంగా మారుతోంది. ఈ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
347FollowersFollow
424,168SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్