Toll Tax increased| ప్రజలపై మరో పిడుగు.. టోల్ ఛార్జీలు పెంపు?

Toll Tax: ఇప్పటికే గ్యాస్, పెట్రోల్ ధరల పెంపుతో సతమతమవుతోన్న ప్రజలకు కేంద్రం మరో షాక్ ఇవ్వనుంది. ఈ సారి టోల్ గేట్ ఛార్జీలు(Toll Charges) పెంచేందుకు సిద్ధమైంది. వచ్చే నెల నుంచే పెంచిన ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా(NHAI) టోల్ ట్యాక్సులను పెంచనుందని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. సుమారు 5 శాతం నుంచి 10 శాతం మేర టోల్ ధరలు పెరగనున్నాయని తెలుస్తోంది.

నేషనల్ హైవేస్ ఫీ రూల్స్ 2008 ప్రకారం ప్రతి సంవత్సరం ఏప్రిల్ 1న ధరలు సవరించాల్సి ఉంటుంది. దీంతో మార్చి చివరి వారంలో రహదారుల అథారిటీ చేసే సిఫార్సులను ఉపరితల రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ పరిశీలించి ధరలపై ఏప్రిల్ 1న ప్రకటన చేయనుంది. అధికార వర్గాల సమాచారం ప్రకారం కార్లు, లైట్ వేట్ వెహికిల్స్‌కు 5శాతం, హెవీ వాహనాలకు 10శాతం పెంచనున్నారని సమాచారం. టోల్ గేట్ ప్రాంతానికి 20 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రజలకు ఇచ్చే నెలవారీ పాసుల ఛార్జీలు సైతం పెంచనున్నట్లు తెలుస్తోంది.

 

Latest Articles

మద్యం మత్తులో బావిలో పడి ఇద్దరు యువకులు మృతి

జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం చింతకుంటలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. శివారులోని ఓ బావిలో పడి ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా కలకలం రేపింది. పల్నాడు జిల్లా వినుకొండ గ్రామానికి చెందిన...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్