మేడిపల్లిలో తిరుమల కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ 2వ శాఖను త్రిదండి చినజీయర్ స్వామీజీతో కలిసి సినీనటుడు సుమన్ ప్రారంభించారు. ఈ ప్రారంభ కార్యక్రమంలో రిసిక్ పీఠాశ్వర్ మహంత్ జనమేజయ్ శరణ్ జీ మహారాజ్ (అయోధ్య), సద్గురు శ్రీ దయానిధి జీ మహారాజ్(కేధర్ నాద్), సాధు విమలమునిదాస్ & సాధు ఆత్మచింతన్ స్వామి కొఠారి స్వామి, తిరుమల బ్యాంక్ సీఈఓ రాజారావుతో పాటు లోకల్ మేయర్, కార్పొరేటర్ పాల్గొన్నారు.
చిన్న జీయర్ స్వామిజీ మాట్లాడుతూ… ‘‘చంద్రశేఖర్ గారికి దేవుడు ఎంతో అనుగ్రహము ఉంది కాబట్టే ఇంత మంది స్వామిజీలు అయోధ్య నుంచి, కేధర్‌నాథ్ నుంచి రావడం ఆశ్వీరదించడం ఆయన మంచి మనసుకు నిదర్శనం. ఈ తిరుమల బ్యాంక్ ఇంకా ఎన్నో బ్రాంచ్‌లను ప్రారంభించాలని కోరుకుంటున్నాను.’’ అని అన్నారు.
సినీనటుడు సుమన్ మాట్లాడుతూ .. ‘‘ఈ రోజు ఇంత మంది స్వామిజీల మధ్య ఈ తిరుమల బ్యాంక్ ప్రారంభం కార్యక్రమంలో పాల్గొన్నడం నా జన్మ ధన్యమైనది. తిరుమల కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్2కి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండడం చాలా సంతోషంగా ఉంది. అలాగే తిరుమల కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ త్వరలో మరిన్ని బ్యాంకులు ప్రారంభించాలని కోరుకుంటున్నాను.’’ అని అన్నారు.