పిఠాపురం పీఠంపై స్వతంత్ర ఛానెల్ సర్వే

 ఏపీలోనే హాట్‌ సీట్‌గా మారిన పిఠాపురం పీఠంపై ఉత్కంఠ నెలకొంది. కూటమి మద్దతుతో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ బరిలో నిలవడంతో అందరి చూపు పిఠాపురంపైనే ఉంది. అధికార పార్టీ వైసీపీ నుంచి జనసేనానికి గట్టి పోటీ ఇస్తున్నారు వంగా గీత. ఇక గత అసెంబ్లీ ఎన్నికల్లో భీమవరం, గాజువాకలో ఓటమి రుచి చూసిన పవన్‌కల్యాణ్‌.. పార్టీ అధినేతగా ఈసారైనా గెలిచి తన పరువు నిలబెట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో తన ప్రత్యర్థి జగన్‌ బరిలో నిలిపిన గీతను ఓడించడానికి పావులు కదుపుతూ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. మరి పిఠాపురంలో ఎవరికి ఎంత బలం ఉంది..? పిఠాపురం పీఠాన్ని అధిరోహించేది ఎవరు..? పవన్‌కు గెలిచే అవకాశాలు ఉన్నాయా..? ఏ సామాజిక వర్గం ఎవరివైపు ఉన్నారు..? ఇరువురికి పడే ఓట్లు ఎన్ని అనేది అంచనా వేస్తే….
  కాపు సామాజిక వర్గం బలంగా ఉన్న పిఠాపురాన్నే పవన్‌కల్యాణ్ ఎంచుకున్నారు. దీంతో తన గెలుపు ఈజీ అనుకున్నా రు అయితే, కాపు సామాజిక వర్గం నుంచి 65 వేల ఓట్లు పోలైతే కనుక పవన్‌కు 50 వేలు, వంగా గీతకు 15 వేలు పడే ఛాన్స్‌ ఉంది. దీంతో 40 వేల ఓట్ల మెజార్టీతో జనసేనాని ముందంజలో ఉంటారు. అలాగే ఎస్సీ సామాజిక వర్గం నుంచి 40 వేల ఓట్లు పడితే కనుక అందులో పవన్‌కు 5 వేలు, గీతకు35 వేల ఓట్లు వచ్చే అవకాశ ముంది. ఈ లెక్కన 10 వేల ఓట్ల ఆధిక్యంతో పవన్‌కల్యాణ్‌ ముందంజ లో ఉంటారు. ఇక వైశ్య, బ్రాహ్మణ, ఇతర ఓసీల నుంచి 4 వేల ఓట్లు పోలైతే , అందులో పవన్‌కు 3 వేలు, గీతకు వేయి ఓట్లు పడితే, అప్పటికీ 13 వేల ఓట్ల మెజార్టీతో పవన్‌దే పై చేయిగా కనిపిస్తోంది. 
    రెడ్డి సామాజిక వరం నుంచి 10 వేలు ఓట్లు పడితే కనుక అందులో పవన్‌కి 2 వేలు, గీతకు 8 వేల ఓట్లు రావచ్చు. అయినప్పటికీ 7 వేల ఓట్ల మెజార్టీతో పవన్‌కల్యాణ్‌ ఆధిక్యంలో ఉంటారు. ఇక ముస్లిం సామాజిక వర్గం నుంచి 1,500 ఓట్లు పోలైతే, పవన్‌కు 100, గీతకు1400 ఓట్లు పడే అవకాశం ఉంది. ఈ లెక్కన 5 వేల ఓట్లతో ముందంజలో పవన్‌కల్యాణ్‌ ఉంటారు. అలాగే శెట్టి బలిజ ఓట్లు 22 వేలు పోలైతే,.. అందులో పవన్‌ కల్యాణ్‌కు 6 వేలు, గీతకు 14 వేల ఓట్లు పడే అవకాశం ఉంది. దీంతో ఇప్పటి వరకూ పైచేయిగా ఉన్న పవన్‌కల్యాణ్‌పై 3 వేల మెజార్టీతో వంగా గీత ముందంజలో ఉంటారు. ఇక మత్స్యకా రుల నుంచి 24 వేల ఓట్లు పడగా అందులో పవన్‌కు 10 వేలు, గీతకు 13 వేలు పడే ఛాన్స్‌ ఉంది. ఈ లెక్క ప్రకారం 6 వేల మెజార్టీతో ఆధిక్యంలో వంగా గీతదే పై చేయి. నగరాల విషయానికి వస్తే, 3 వేల ఓట్లు అక్కడ నుంచి పోలవగా పవన్‌కు 2 వేలు, గీతకు వేయి ఓట్లు పడే అవకాశం ఉంది. దీంతో 5 వేల ఓట్ల ఆధిక్యంతో గీత ముందంజలో ఉంటారు. చేనేత ఓట్లు 20 వేలు పడితే కనుక పవన్‌కు 10 వేలు, గీతకు 10 వేలు పోలవగా 5 వేల ఓట్లతో ముందంజలో గీత ఉంటారు. ఇదే లెక్కన యాదవ సామాజిక వర్గం ఓట్లు 12 వేలు పడితే, అందులో పవన్‌కు 5 వేలు, గీతకు 7 వేలు పడతాయని, చివరికి 7 వేల మెజార్టీతో వైసీపీ అభ్యర్థి గీతదే పై చేయి అని స్వతంత్ర అధ్యయనం చెబుతోంది. 
     మండలాలు, గ్రామాలు, సామాజిక వర్గాల వారిగా వేసిన అంచనాల ఆధారంగా తేలిన లెక్కలివి. ఈ స్టడీలో చివరగా 7 వేల ఓట్ల మెజార్టీతో వంగా గీత జనసేనాని పవన్‌కల్యాణ్‌పై గెలిచే అవకాశమున్నట్టుగా తెలుస్తోంది. ఇక వైసీపీ గనుక భారీ ఎత్తున పోల్ మేనేజ్‌మెంట్‌ చేయగలితే 10 వేల నుంచి 12 వేల ఓట్ల మెజార్టీ పెరిగే అవకాశముందని ఈ అధ్యయ నంలో తేలింది. ఒక వేళ ఈ లెక్కలు తారుమారు అయి పవన్‌కల్యాణ్‌ గెలిచినా 2 నుంచి 3 వేల మెజార్టీ రాదని ఈ లెక్కలు చెబుతున్నాయి. మొత్తంగా చూస్తే, జనసేన అధినేత పవన్ కల్యాణ్ విజయం నల్లేరు మీద నడకేమీ కాదని స్వతంత్ర జరిపిన అధ్యయనం లో తేలింది.

Latest Articles

తెలంగాణలో భారీ వర్షాలు…ప్రాజెక్టులకు జలకళ

ఎగువన కురుస్తున్న వర్షాలతో తెలంగాణలోని పలు ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి. ఎగువ నుంచి వస్తున్న వరదతో SRSP,కడెం, ఎల్లంపల్లి, జురాల ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. భారీ వర్షాల నేపథ్యంలో కడెం ప్రాజెక్టు నిండుకుండలా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్