మాజీ క్రికెటర్ అంబటి రాయుడుకు బెదిరింపులు

టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడి ఫ్యామిలీకి బెదిరింపులు వచ్చినట్టు ఆయన స్నేహితుడు సామ్‌పాల్‌ తెలిపారు. ఆయన భార్యా బిడ్డలను అత్యాచారం చేసి హతమారుస్తామని బెదిరిస్తున్నారని… అసభ్య పదజాలంతో దూషణలు చేస్తున్నారని చెప్పారు. అంబటి కుటుంబం తీవ్ర భయాందోళనకు గురవుతుందని.. బెదిరింపులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.

ఆరెంజ్‌ క్యాప్‌ గెలిచినంత మాత్రాన కప్‌ గెలవలేరు అంటూ విరాట్‌ కోహ్లీపై విమర్శలు గుప్పించాడు అంబటి రాయుడు. ఈ కామెంట్స్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డ విరాట్‌ అభిమానులు రాయుడు కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ బెదిరింపులకు పాల్పడ్డట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే రాయుడు భార్య, పిల్లలపై లైంగిక దాడి చేసి చంపేస్తామని బెదిరిస్తున్నారని అంబటి స్నేహితుడు తెలిపాడు. ప్రతి వ్యక్తికి రాజ్యంగం కొన్ని హక్కులు కల్పిస్తుంది. వాటిని కొంత మందికాలరాస్తున్నారు. ఈ విషయంపై పోలీసులు, న్యాయవ్యవస్థ కలగజేసుకుని వారిని కఠినంగా శిక్షించాలని చెప్పుకొచ్చాడు.

Latest Articles

హెలో స్పేస్‌.. విక్రమ్‌ 1 వచ్చేసింది.. స్కైరూట్‌తో భారత అంతరిక్ష చరిత్రలో మరో చారిత్రక రాకెట్‌ ప్రయోగం

భారత అంతరిక్షరంగంలో మరో ప్రైవేటు రంగానికి బాటలు పడ్డాయి. విక్రమ్‌-1 రాకెట్‌ ప్రయోగం విజయవంతమైంది. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ స్పేస్‌టెక్‌ స్టార్టప్‌ స్కైరూట్‌ ఏరో స్పేస్‌ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్