Fixed Deposits |ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తున్నారా.. ఈ విషయాలు తెలుసుకోండి.. లేదంటే రిస్క్‌లో పడొచ్చు..

Fixed Deposits |భవిష్యత్తు అవసరాల కోసం పొదుపు చేయాలనుకునే చాలామంది ఎంచుకునే పథకం ఫిక్స్‌డ్ డిపాజిట్లు. ఎంపిక చేసుకున్న కాలపరిమితిలో డబ్బును ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తే మంచి వడ్డీ లభిస్తుంది. కానీ మెచ్యూరిటీ వ్యవధి కంటే ముందు ఫిక్స్‌డ్ డిపాజిట్ల నుంచి ఆ మొత్తాన్ని విత్‌డ్రా చేయలేరు . అలా చేస్తే అపరాధ రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఫిక్స్‌డ్ డిపాజిట్లలో పెట్టుబడి పెట్టడం ద్వారా సీనియర్ సిటిజన్‌లు ఎన్నో ప్రయోజనాలు పొందుతారు.

ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేసే సీనియర్ సిటిజన్లకు అనేక బ్యాంకులు అధిక వడ్డీ రేట్లు అందిస్తున్నాయి. కొంత నిర్ధిష్ట కాలానికి నగదు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అన్ని బ్యాంకులు ఒకటే వడ్డీ రేటును చెల్లించవు. ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వేర్వేరు వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. పోస్టాఫీసులో కూడా ఫిక్స్‌డ్ డిపాజిట్ ఖాతా తెరవవచ్చు. అయితే ఫిక్స్‌డ్ డిపాజిట్‌లో పెట్టుబడి పెట్టే ముందు దానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలను తెలుసుకోవాలి. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని పెట్టుబడి పెడితే మంచి రాబడిని పొందవచ్చు.

ఫిక్స్‌డ్ డిపాజిట్ ఖాతా ఓపెన్‌చేయాలనుకుంటే.. అవసరమైన డాక్యుమెంట్స్‌తో సమీపంలోని బ్యాంకుకు వెళ్లాలి. ఫిక్స్‌డ్ డిపాజిట్ ఖాతాకు సంబంధించిన అప్లికేషన్‌ను పూర్తి చేయాలి. ఫిక్స్‌డ్ డిపాజిట్‌లో పెట్టుబడి పెట్టాల్సిన మొత్తాన్ని డిపాజిట్ చేయాలి.

Fixed Deposits | మెచ్యూరిటీ కాలానికి ముందు నగదు తీసుకుంటే..

ఫిక్స్‌డ్ డిపాజిట్‌లో పెట్టుబడి నిర్ణీత కాలానికి జమ చేయబడుతుంది. నిర్ణీత వ్యవధి కంటే ముందే మీ మొత్తాన్ని విత్‌డ్రా చేస్తే వినియోగదారుడుకి నష్టం వస్తుంది. ఫిక్స్‌డ్ డిపాజిట్‌లో 5 సంవత్సరాల పాటు ఇన్వెస్ట్ చేసి ఉంటే, దాని మెచ్యూరిటీ తర్వాత మాత్రమే ఆ అమౌంట్ విత్‌డ్రా చేసుకోవచ్చు.లేదు అవసరం అనుకుంటే కనీసం ఒక సంవత్సరం పాటు వేచి ఉండాలి. అప్పుడు మాత్రమే ఒక సంవత్సరం డిపాజిట్‌పై మాత్రమే వర్తించే వడ్డీ రేటును పొందగలుగుతారు.

Read Also: పొదుపు పథకాల్లో పెట్టుబడి పెట్టేవారికి బోలెడన్ని బెనిఫిట్స్‌..

Follow us on:   Youtube    Instagram

Latest Articles

హీరో విజయ్‌ దేవరకొండకు TCA లీగల్ నోటీసులు

హీరో విజయ్‌ దేవరకొండకు తెలంగాణ క్రికెట్‌ అసోసియేషన్‌ లీగల్ నోటీసులు పంపింది. HCA టీజీ20 లీగ్‌ను ప్రమోట్‌ చేయడంపై నోటీసులు ఇచ్చింది.  HCA టీజీ20 లీగ్‌కు బీసీసీఐ అనుమతి లేదని TCA పేర్కొంది....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
347FollowersFollow
424,168SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్