డీఎస్పీ గేట్లు తెరవడం వల్లే తొక్కిసలాట- టీటీడీ ఈవో శ్యామలరావు

తిరుపతి తొక్కిసలాట ఘటనపై టీటీడీ ఈవో శ్యామలరావు కీలక వ్యాఖ్యలు చేశారు. నిర్లక్ష్యంగా గేట్లు తెరవడం వల్లే ఘటన జరిగిందని అన్నారు. ముందు జాగ్రత్త తీసుకోకుండా డీఎస్పీ గేట్లు తెరిచినట్టు తెలిసిందన్నారు. పూర్తి స్థాయి విచారణ తర్వాతే కారణాలు తెలుస్తాయని ఆయన వెల్లడించారు.

పద్మావతి మెడికల్ కళాశాలలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించిన టీటీడీ ఈవో శ్యామలా రావు.. క్షతగాత్రుల పరిస్థితిపై వైద్యుల బృందంతో ఈవో ఆరా తీశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఈఓ.
ఘటనలో ఆరుగురు మృతి చెందారని చెప్పారు. 41 మంది గాయపడ్డారని తెలిపారు. ఘటనకు కారణం ఏంటనేది విచారిస్తున్నామని చెప్పారు.

భక్తుల ఆరోగ్యం పరిస్థితిని స్విమ్స్ సూపరింటెండెంట్ రవికుమార్ వివరించారు. అందరికీ చికిత్స అందిస్తున్నామని.. ముగ్గురు మాత్రం మరో రెండు మూడు రోజుల పాటు అబ్జర్వేషన్‌లో ఉండాల్సి ఉంటుందన్నారు.

Latest Articles

స్వతంత్ర న్యూస్‌ చానెల్ 4వ వార్షికోత్సవం..హాజరైన అతిరథమహారథులు

స్వతంత్ర న్యూస్‌ చానెల్ 4వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. నాలుగేళ్ల కిందట జూన్‌ 26న స్వతంత్ర టీవీ ప్రస్థానం ప్రారంభమైంది. నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్‌లోని బేగంపేట్‌ ఐఏఎస్‌ ఆఫీసర్స్‌ క్లబ్‌లో...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
425,369SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్