కదం తొక్కిన RTC కార్మికులు.. చర్చలకు ఆహ్వానించిన గవర్నర్..!

స్వతంత్ర వెబ్ డెస్క్: నెక్లెస్‌ రోడ్డులోని అంబేడ్కర్ విగ్రహం వద్దకు ఆర్టీసీ(RTC) ఉద్యోగులు భారీగా చేరుకున్నారు. ఆర్టీసీ బస్సుల్లో కార్మికులు, ఉద్యోగులు తరలివచ్చారు. నెక్లెస్‌ రోడ్డు నుంచి రాజ్‌భవన్‌కు (RAJ BHAVAN) ర్యాలీగా వెళ్లారు. రాజ్‌భవన్‌ వద్ద గవర్నర్‌కు వ్యతిరేకంగా నిరసన తెలపనున్నారు. ఆర్టీసీ బిల్లుకు గవర్నర్‌ ఆమోదం తెలపాలని కార్మికులు డిమాండ్‌ చేస్తున్నారు. రాజ్‌భవన్‌ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ మార్గంలో రాకపోకలకు  ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.ఈ సందర్భంగా ఆర్టీసి బిల్లుపై యూనియన్ నాయకులను గవర్నర్ తమిళిసై(THAMILSAI) చర్చలకు ఆహ్వానించారు.  అయితే, ప్రస్తుతం గవర్నర్ తమిళిసై పుదుచ్చేరిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆర్టీసి యూనియన్ నాయకులతో పుదుచ్చేరి నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతానని గవర్నర్ తమిళిసై తెలిపారు. దీంతో 10 మంది యూనియన్ నాయకులు రాజ్‌భవన్ నుంచి గవర్నర్‌తో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడేందుకు అంగీకరించారు.

 

Latest Articles

జనసేన ఓట్ల వ్యూహానికి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుండగా.. బీజేపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్