స్వతంత్ర వెబ్ డెస్క్: ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌ను చంపేస్తానని బెదిరింపు మేసేజ్ లు పంపిన వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసులు. అతను పూణెకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా గుర్తించిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 32 ఏళ్ల సాగర్ బార్వేగా ఫేస్‌బుక్ ద్వారా శరద్ పవార్‌కు హెచ్చరికలు పంపాడు. ఈ నేపథ్యంలో ఫేస్‌బుక్, ట్విట్టర్ ద్వారా వస్తున్న బెదిరింపులపై పవార్ కుమార్తె సుప్రియా సూలె ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 14 వరకు కోర్టు అతడిని రిమాండ్‌కు పంపింది. బార్వే ఫేస్‌బుక్ ద్వారా శరద్ పవార్‌కు హెచ్చరికలు పంపాడు. బార్వే ఫేస్‌బుక్‌లో శరద్ పవార్‌ను హెచ్చరిస్తూ చేసిన పోస్టులో.. మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పోరాడిన నరేంద్ర దభోల్కర్‌కు పట్టిన గతే శరద్ పవార్‌కూ పడుతుందని హెచ్చరించాడు. నరేంద్ర దభోల్కర్‌ను 2013లో బైక్‌పై వచ్చిన దుండగులు కాల్చి చంపారు. ఈ బెదిరింపుపై ఎన్సీపీ కార్యకర్త ప్రత్యేకంగా లోక్‌మాన్య తిలక్ మార్గ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఐపీ అడ్రస్ ద్వారా నిందితుడిని గుర్తించిన పోలీసులు బార్వేను అరెస్ట్ చేశారు. ట్విట్టర్ ద్వారా బెదిరించిన నిందితుడి కోసం గాలిస్తున్నారు.
శరద్ పవర్‌ను బెదిరించిన వ్యక్తి అరెస్ట్
0
281
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


