30.4 C
Hyderabad
Saturday, June 21, 2025
spot_img

ఇద్దరి భార్యల ముద్దుల మొగుడు….మూడో పెళ్లికి భార్యలే పెళ్లి పెద్దలు

అప్పటికే ఇద్దరు భార్యలతో కాపురం చేస్తున్న సాగేని పండన్న జూన్‌ 25న ముచ్చటగా మూడో పెళ్లి చేసుకున్నాడు. మొదటి ఇద్దరు భార్యలు గ్రామంలోని ఇంటింటికీ వెళ్లి స్వయంగా పెళ్లి ఆహ్వానాలు అందించారు. సందడిగా వివాహ విందు, వినోదం ఏర్పాటు చేశారు. పండన్న ఇద్దరు భార్యలు దగ్గరుండి మరీ అతనికి మూడో పెళ్లి జరిపించారు. అల్లూరి జిల్లా ఏజెన్సీలోని పెదబయలు మండలం గుల్లెలు పంచాయతీ కించూరులో మూడో పెళ్లి వేడుక వైభవంగా జరిగింది.

సాగేని పండన్న పార్వతమ్మను తొలుత వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు మొదటి భార్య అంగీకారంతో అప్పలమ్మను రెండో భార్యను చేసుకున్నాడు. ఇద్దరు భార్యలతో పండన్న సంసార జీవితం సాఫీగా సాగిపోతోంది. ఇద్దరు భార్యలతో కలిసి కాపురం చేస్తున్నా, ఏనాడూ ఎలాంటి కుటుంబ కలహాలు లేకుండా భార్యలిద్దరూ భర్తను చక్కగా చూసుకుంటున్నారు.అయితే లక్ష్మి అనే మరో యువతిపై పండన్న మనసు పారేసుకున్నాడు. లక్ష్మిది జి. మాడుగుల మండలం కిల్లంకోట పంచాయతీ బందవీధి గ్రామం. లక్ష్మిని ఇష్టపడిన విషయం, తనను ఎంతగానో ప్రేమించే ఇద్దరు భార్యలకు చెప్పాడు. దీంతో తన భర్త ఆనందంలో తమ ఆనందం చూసుకునే ఇద్దరు భార్యలు పార్వతమ్మ, అప్పలమ్మ పండన్నను ప్రోత్సహిం చారు. ఇంకేం ఇద్దరు భార్యల నుంచి ప్రోత్సాహం లభించడంతో పండన్న వెనక్కి చూడలేదు. ఎలాగైనా లక్ష్మిని పెళ్లి చేసుకొని తమ జీవితంలోకి ఆహ్వానించాలని అనుకున్నాడు. అంతే.. తన ఇద్దరు భార్యలతో రాయభారం పంపాడు. పెద్దలు కూడా అంగీకరించారు. దీంతో లక్ష్మిని పండన్నకు ఇచ్చి పెళ్లి చేసేందుకు ఆమె బంధువులు సిద్ధమయ్యారు. జూన్‌ 25 ఉదయం 10 గంటలకు పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేశారు.

సాగేని పండన్నకు తల్లిదండ్రులు లేరు. మొదటి ఇద్దరు భార్యలే పండన్నకు సర్వస్వం. వారు కూడా పండన్నను ప్రాణానికి మించి చూసుకుంటున్నారు. పండన్నకు పెళ్లి పెద్దలు కూడా వాళ్ళిద్దరే అయ్యారు. శుభ లేఖల్లో ఆ ఇద్దరు భార్యలే అందరినీ ఆహ్వానిస్తున్నట్టు ముద్రించారు. ఇంటింటికీ వెళ్లి శుభలేఖలు పంచిపెట్టారు. బంధు మిత్రులను ఆహ్వానించారు. ‘మీ రాకను ప్రేమతో ఆహ్వానిస్తూ, నిండు మనసుతో ఆశీర్వదించి మా ఆతిథ్యం స్వీకరించ ప్రార్థన అంటూ సాగేని పార్వతమ్మ, సాగేని అప్పలమ్మ’ అని శుభలేఖను ముద్రించారు.ముహూర్తం ప్రకారం కించూరులో పండన్న- లక్ష్మి జంటకు వివాహం జరిగింది. నవ వధువు లక్ష్మి తరఫు బంధువులు, పండన్న బంధు మిత్రులు, గ్రామ పెద్దలు వివాహానికి హాజర య్యారు. అదే స్థాయిలో విందు కూడా ఏర్పాటు చేశారు. అందరూ కలిసి పండన్న- లక్ష్మి వివాహాన్ని గ్రాండ్‌గా జరిపించారు. పండన్న సంసారం సుఖసంతోషాలతో సాగిపోవాలని బంధువులు, అతిథులంతా మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్