భార్యను చంపేసి… ఆత్మహత్య చేసుకున్న భర్త

Murder | భార్యను కొట్టి చంపి భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన ఏపీలోని ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. ఒంగోలులోని విరాట్‌నగర్‌లో అంజిరెడ్డి, పూర్ణిమ అనే దంపతులు నివాసం ఉంటున్నారు. పెళ్ళై కొన్నేళ్లు అయినా.. వీరిద్దరి మధ్య సఖ్యత కుదిరేది కాదు. తరచు గొడవలు జరిగేవి. ఈ క్రమంలో మంగళవారం దంపతుల మధ్య గొడవ జరిగింది. కుటుంబ కలహాలు చెలరేగి మాటలతోమొదలైన యుద్ధం.. పోట్లాడుకునే దాకా వచ్చింది. తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయిన భర్త అంజిరెడ్డి.. భార్య పూర్ణిమను చపాతి కర్రతో బలంగా కొట్టాడు. దీంతో ఆమె అక్కడే మృతి చెందింది. దీంతో భయబ్రాంతులకు గురైన అంజిరెడ్డి.. అక్కడినుంచి వెంటనే పారిపోయి.. ఇక చేసేది ఎం లేక.. కొత్తపట్నం వద్ద సముద్రంలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Latest Articles

అమెరికాలో హిందూ ఆలయంపై దాడి

         ఆలయంలో భక్తులు పూజలో మునిగిపోయారు. దైవ చింతనలో లీనమయ్యారు.. సరిగ్గా అదే సమయాన్ని అదునుగా  తీసుకున్నారు కొందరు దుండగులు. ఆలయాన్ని చుట్టుముట్టి.. ఇటుకలతో టార్గెట్‌ చేసి దాడికి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్