ఉమ్మడి పాలమూరు జిల్లాలో పీక్స్ కి చేరిన ఎన్నికల ప్రచారం

    సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా జాతీయ స్థాయి నేతలు ఉమ్మడి పాలమూరు జిల్లాలో పర్యటనలు చేస్తున్నారు. ఇందులో భాగంగా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నారాయణపేట జిల్లాలో నిర్వహించే భారీ బహిరంగ సభకు హాజరు కానున్నారు. ఈ బహిరంగ సభ ద్వారా ప్రధానమంత్రి వచ్చే ఎన్నికల్లో బిజెపి పార్టీని గెలిపించాలని ప్రజలను కోరను న్నారు. దీంతోపాటు ఉమ్మడి పాలమూరు జిల్లా వరప్రదాయని అయిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జాతీయ హోదాపై ప్రధానమంత్రి మాట్లాడే అవకాశం ఉంటుందని బిజెపి శ్రేణులు చెబుతున్నారు. మధ్యాహ్నం మూడున్నర గంటలకు నారాయణపేటకు హెలికాప్టర్లో ప్రధానమంత్రి రానున్నారు. అనంతరం నిర్వహించే బహిరంగ సభలో ప్రసంగించను న్నారు. పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. సభ ఏర్పాట్లను మహబూబ్ నగర్ పార్లమెంటు అభ్యర్థి డీకే అరుణ పరిశీలించారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ జన జాతర సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మక్తల్ నియోజక వర్గనికి రానున్నారు. మహబూబ్ నగర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డికి మద్దతుగా సీఎం రాను న్నారు. ఇప్పటికే మక్తల్ లో జన జాతర కు సంబంధించి సభా ఏర్పాట్లను స్థానిక ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి పరిశీలించారు. సాయంత్రం జరిగే ఈ జన జాతర సభకు భారీ సంఖ్యలో ప్రజలను తరలించేందుకు కాంగ్రెస్ శ్రేణులు చర్యలు తీసుకు న్నారు. ముఖ్యమంత్రి రాక సందర్భంగా పోలీసులు గట్టి బందోబస్తు చేపట్టారు.

Latest Articles

టీడీపీలో దిద్దుబాటు చర్యలు?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భవిష్యత్ ప్రయాణంపై సరికొత్త విశ్లేషణలు తెరపైకి వస్తున్నాయి. కేవలం సంక్షేమం, అభివృద్ధిని నమ్ముకుని అంతా సవ్యంగానే ఉందనుకుంటే మొదటికే మోసం వస్తుందన్న హెచ్చరికలు తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్