Free Porn
xbporn
23.7 C
Hyderabad
Saturday, July 20, 2024
spot_img

గ్రేటర్ పై యాక్షన్ కు సిద్ధమైన కాంగ్రెస్ సర్కార్

   గ్రేటర్ హైదరాబాద్ పై కాంగ్రెస్ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకు ప్రత్యేక టీమ్ ఏర్పాటు చేయాలని సర్కారు భావిస్తోంది. ఆస్తుల రక్షణతోపాటు అలసత్వ అధికారులపై చర్యలకు సిద్ధమవుతోంది. అసెట్స్ ప్రొటెక్షన్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ పేరుతో స్పెషల్ వింగ్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. రాబోయే రెండు నెలల్లో రాష్ట్ర సర్కారు యాక్షన్ మొదలు పెట్టనున్నట్టు తెలిసింది.

   హైదరాబాద్ నగరంతోపాటు, హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న ప్రభుత్వ భూముల రక్షణపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సాధించింది. ప్రభుత్వ భూముల లెక్కలను తీయాలని ఇప్పటికే ఇటు జిహెచ్ఎం సి, అటు హెచ్ఎండిఏ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. భూముల లెక్కలకు సంబంధించిన రిపోర్టులు ఇప్పటికే సీఎం కార్యాలయానికి అందాయి. కబ్జా భూములు స్వాధీనం చేసుకునే పరిస్థితి ఎన్ ఫోర్స్ మెంట్ కు పూర్తిస్థాయిలో లేకపోవడంతో స్పెషల్ గా ఇండిపెం డెంట్ బాడీ ఏర్పాటుకు సర్కారు సంసిద్ధం అవుతోంది. ఏసీబీ, విజిలెన్స్ తరహా వింగ్ ఏర్పాటుకు సర్కారు రెడీ అవుతోంది. ప్రజా రక్షణ, ప్రభుత్వ ఆస్తుల భద్రత, భవిష్యత్ లో ప్రభుత్వ ఆస్తులు దుర్వినియోగం కాకుండా చూడటం, ప్రభుత్వ ఆస్తులు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకుండా చూడటం,కబ్జాలకు గురైన చెరువులు, భూములు, అక్రమ బడా భవనాల స్వాధీనం తదితర అంశాలపై సర్కారు దృష్టి సారించింది. ఐజి స్థాయి ఐపీఎస్ ఉన్నతాధికారి AV రంగనాథ్ ను నియమించింది. ఇక ఇప్పటివరకు జరిగిన తప్పుల్లో అధికారుల పాత్రను సైతం తేల్చేందుకు ఈ ప్రత్యేక వింగ్ కు ప్రత్యేక అధికారాలను సర్కారు ఇవ్వనుంది.

   అసెట్స్ ప్రొటెక్షన్ అండ్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ పేరుతో లేదా చిన్న చిన్న మార్పులు చేసి మరో పేరుతో ఈ స్పెషల్ వింగ్ ఏర్పాటు కానుంది. మరో రెండు రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తికానున్నట్టు తెలిసింది. ఇప్పటివరకు జిహెచ్ఎంసి ఎన్ ఫోర్స్ మెంట్ వింగ్ జిహెచ్ఎంసి పరిధి వరకే ఉంది, అయితే, ఈ స్పెషల్ వింగ్ ఏర్పాటు తర్వాత హెచ్ఎండిఏ పరిధి, అవతల నాలుగు కిలోమీటర్ల మేరకు ఈ స్పెషల్ వింగ్ పరిధులు ఉండనున్నట్టు తెలిసింది. ఇప్పటివరకు కబ్జాలు భూఆక్రమణలు, అధికారుల తప్పిదా లు, తేల్చాలంటే ఇప్పుడున్న మ్యాన్ పవర్ సరిపోని పరిస్థితి ఉంది. ఐజి స్థాయి ఉన్నతాధికారి రంగనాథ్ ఈ వింగ్ కు చీఫ్ గా వ్యవహరించనున్నారు. ఈ స్పెషల్ టీంలో ముగ్గురు ఎస్పీ స్థాయి అధికారులు, 8 మంది డిఎస్పీ స్థాయి అధికారులు, సిఐలు, కొంతమంది డిప్యూటీ కలెక్టర్ల హోదాలో ఉన్న అధికారులు, జిహెచ్ఎంసి, వాటర్ బోర్డు, ఫైర్ సిబ్బంది, మొత్తంగా మూడువేల మందిని ప్రభుత్వం ఈ స్పెషల్ అసెట్స్ ప్రొటెక్షన్ వింగ్ కు ఇవ్వనున్నట్టు సమాచారం. కబ్జాకు గురైన సర్కారు భూములను వెనక్కు తీసుకోవడంతో పాటు, కబ్జాకు సహకరించిన అధికారులపై కొరడా ఝళిపించేందుకు ప్రభుత్వం సిద్ధం అవుతోంది. అవసరాన్ని బట్టి కబ్జాదారుల పై కేసులు పెట్టేందుకు ఈ వింగ్ కు అధికారాలు ఇవ్వనున్నట్టు తెలిసింది. అయితే, రాబోయే రెండు నెలల్లో గ్రేటర్ నిర్ణయాల పై సర్కార్ యాక్షన్ మొదలు అవుతుందా లేదా అనేది వేచి చూడాల్సి ఉంది.

Latest Articles

హీరోయిజం గురించి ఎన్టీయార్ బామ్మర్ది భలే చెప్పాడు: అల్లు అరవింద్

ఎన్నో సక్సెస్‌ఫుల్ చిత్రాలను అందించిన ప్రతిష్టాత్మక సంస్థ GA2 పిక్చర్స్ బ్యానర్‌పై రూపొందిన చిత్రం ‘ఆయ్’. ఎనర్జిటిక్ హీరో నార్నే నితిన్, నయన్ సారిక జంటగా నటించారు. అంజి కె.మ‌ణిపుత్ర‌ ఈ చిత్రంతో...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్