38.2 C
Hyderabad
Tuesday, May 5, 2026
spot_img

Srikakulam : సముద్ర తీరంలో అతి పెద్ద బ్లూ వేల్.. సెల్ఫీల కోసం ఎగబడిన జనాలు

స్వతంత్ర వెబ్ డెస్క్: శ్రీకాకుళం జిల్లాలో సముద్రం ఒడ్డుకు బ్లూ వేల్ (నీలి తిమింగలం) కొట్టుకువచ్చింది. సంతబొమ్మాళి మండలం పాత మేఘవరం – డి మరువాడ సముద్ర తీరాల మధ్య గురువారం సాయంత్రం ఈ భారీ నీలి తిమింగలం కనిపించింది. ఈ బ్లూ వేల్ సుమారు 25 అడుగుల పొడవు.. ఐదు టన్నుల వరకు బరువు ఉంది. ఇది చనిపోయి ఉన్నట్లు స్థానికులు, మత్స్యకారులు గుర్తించారు.

ఈ నీలి తిమంగలాన్ని బ్లూ వేల్ అంటారని మత్స్యకారులు చెబుతున్నారు. భారీ పరిమాణంతో చూడటానికి వింత జీవిలా ఉండటంతో.. దీనిని చూసేందుకు చుట్టు పక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో జనాలు తరలి వస్తున్నారు. నీలిరంగుతో ఆహ్లాదకరంగా కనిపించే సముద్రం అల్పపీడన ప్రభావంతో గత వారం రోజులుగా అల్లకల్లోలంగా ఉంది. సముద్రంలో కెరటాలు ఉవ్వెత్తున ఎగసి పడుతున్నాయి. ఈ సమయంలో నీలి తిమింగలం చనిపోయింది.

ఈ తిమింగలం బంగాళాఖాతంలో చాలా అరుదుగా ఉంటాయని.. లోతులేని నీటిలో చేరి చనిపోయి ఉండొచ్చని మత్స్యకారులు భావిస్తున్నారు. అయితే అత్యంత భారీగా ఉండే జాతులలో ఇది కూడా ఒకటి అంటున్నారు. సుమారుగా 5 టన్నులు మాత్రమే ఉండడంతో ఇది పిల్ల తిమింగలంగా అనుమానిస్తున్నారు. స్థానికులు, మత్స్యకారులు అధికారులకు సమాచారం ఇచ్చారు.

Latest Articles

సంగారెడ్డి జిల్లాలో విషాదం.. బావిలో పడి తల్లి, ఇద్దరు కుమార్తెలు మృతి

సంగారెడ్డి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. కంగ్టి మండలం బోర్గి గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన తల్లి, ఇద్దరు కుమార్తెలు బావిలో పడి ప్రాణాలు కోల్పోయారు. వివరాల ప్రకారం, తల్లి సావిత్రిబాయి తన...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్