అందువల్లే రాష్ట్రానికి భారీగా ఆదాయం- మంత్రి శ్రీనివాస్ గౌడ్

స్వతంత్ర వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్రానికి మద్యం విక్రయాల ద్వారా భారీగా ఆదాయం పెరిగిందని అందరూ భావిస్తున్నారని అయితే ఇదంతా నకిలీ, అనుమతి లేని మద్యంపై ఉక్కుపాదం మోపడం వల్లే ఇది సాధ్యమైందని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. సమైక్య రాష్ట్రంలో నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ అమ్మకాలు, గుడుంబా, సొంత లేబిళ్ల‌ ద్వారా తయారు చేసే నకిలీ మద్యం, ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి వచ్చే మద్యం వల్ల ఆదాయం కోల్పోయే పరిస్థితి ఉండేదన్నారు.

రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వీటన్నిటినీ కట్టడి చేయడం వల్లే, రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు అదనంగా ఆదాయం వస్తోందని ఆయన పేర్కొన్నారు. ఎక్సైజ్ టెండర్ల లక్కీ డ్రాకు ముందు అక్కడి ఏర్పాట్లను పర్యవేక్షించిన తర్వాత మంత్రి కలెక్టరేట్ సమావేశ మందిరంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో మొత్తం 2,620 మద్యం దుకాణాలు ఉండగా..ప్రస్తుతం 2598 దుకాణాలకు టెండర్లు నిర్వహిస్తున్నామని మంత్రి తెలిపారు.

ఇందుకోసం 131490 మంది టెండర్లలో పాల్గొన్నారని అన్నారు. 22 దుకాణాలకు తక్కువ మొత్తంలో టెండర్లు దాఖలు కావడం వల్ల వాటికి ప్రస్తుతం టెండర్లు నిర్వహిండం లేదన్నారు. అత్యంత పారదర్శకమైన నూతన ఎక్సైజ్ పాలసీని తీసుకురావడం వల్ల ఎక్కడ కూడా మద్యం దుకాణాల కోసం సిండికేట్లు కాకుండా కఠినమైన చర్యలు తీసుకున్నట్లు వివరించారు.

Latest Articles

బాలయ్య సినిమాల.. ప్లానింగ్ మారుతుందా..?

నందమూరి బాలకృష్ణకి.. షూటింగ్లో గాయాలు అవ్వడం తెలిసిందే. ఈ వార్త బయటకు వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. ప్రస్తుతానికి ఈ మూవీ షూటింగ్ ఆగిపోయింది. దీంతో బాలయ్య సినిమాల...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్