స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో టెరరిస్ట్ సంచారం ఉన్నట్లు వచ్చిన సమాచారం రూమర్స్ అని తేల్చి చెప్పారు ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి. మెయిల్ ద్వారా వచ్చింది ఫేక్ న్యూస్ అని, వాటిని ఎవరూ నమ్మాల్సిన పనిలేదని తెలిపారు. ఎవరో కావాలని మెయిల్ పంపినట్టు అనుమానిస్తున్నామని తెలిపారు. ఈ విషయం గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వెల్లడించారు. కాగా, సోమవారం తిరుమలలో టెరరిస్ట్ సంచారం ఉన్నట్లు పోలీసులకు గుర్తుతెలియని వ్యక్తులు మెయిల్ ద్వారా సమాచారం అందించారు. ఈ నేపథ్యంలో తిరుమలలో భధ్రతాధికారులు హైఅలర్ట్ ప్రకటించారు. ఈ క్రమంలో ఆలయ పురవీధులు, ఏడు కొండల్లో భద్రతా సిబ్బంది తనిఖీలు ప్రారంభించారు. ఇందులో భాగంగా సీసీ కెమెరా ఫుటేజ్ ను కూడా పరిశీలించారు.
తిరుమలలో టెరరిస్ట్ సంచారం.. క్లారిటీ ఇచ్చిన ఎస్పీ
0
308
Latest Articles
తెలంగాణలో రసవత్తరంగా ఆస్తుల ప్రదర్శన
తెలంగాణ రాష్ట్రం వచ్చి పన్నెండేళ్లు అవుతున్న సందర్భంగా మన రాజకీయ నాయకులు ఎంతగా అభివృద్ధి చెందారో ఇప్పుడు ప్రజలకు కళ్లకు కట్టినట్లు అర్థమవుతోంది. రాష్ట్రం ఏమో కానీ నాయకుల భూబ్యాంకులు మాత్రం ఎకాయెకిన...
- Advertisement -
- Advertisement -


