స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్ రెడ్డి(58) ఆరోగ్యం నిలకడగానే ఉందని ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయనకు తమ పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నామని ప్రకటించారు. కాగా చాతిలో నొప్పి కారణంగా ఆదివారం రాత్రి కిషన్ రెడ్డి ఢిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరారు. కార్డియోన్యూరో సెంటర్‌లోని కార్డిక్ కేర్ యూనిట్‌లో పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆయనకు గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నట్లు నిర్థారించారు. అందుకు తగ్గట్లుగా ప్రస్తుతం వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కాగా 2019 లోక్ సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి కిషన్ రెడ్డి ఎంపీగా గెలుపొంది కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
నిలకడగా కిషన్ రెడ్డి ఆరోగ్యం.. హెల్త్ బులిటెన్ విడుదల
0
283
Latest Articles
వీడని చిన్నారి జ్ఞానేశ్వరి మిస్టరీ
కాకినాడ జిల్లాలో మిస్ అయిన చిన్నారి జ్ఞానేశ్వరి మిస్టరీ వీడడం లేదు. పన్నెండు రోజులు గడిచినా చిన్నారి ఆచూకీ లభించలేదు. పోలీసులు,ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు రెస్క్యూ సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నా చిన్న క్లూ కూడా...
- Advertisement -
- Advertisement -


