క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో యువకుడు మృతి

Siddipet |అసలు గుప్పడెంత గుండెకు ఏమవుతోంది?. చిన్న, పెద్ద, ముసలి, ముతక అనే తేడా లేకుండా మనుషులను చంపేస్తోంది. ఇటీవల కాలంలో గుండెపోటు(Hear attack)తో ఆకస్మాత్తుగా చనిపోతున్న వారి సంఖ్య ఎక్కువైపోతుంది. డ్యాన్స్ వేస్తుండగా ఒకరు, పాఠం చెబుతుండగా మరొకరు, కూర్చున్న కుర్చీలోనే మరొకరు ఇలా ఎంతోమంది సడెన్ హార్ట్ స్ట్రోక్స్ తో ప్రాణాలు వదులుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే సిద్ధిపేట(Siddipet) జిల్లా హుస్నాబాద్ లో చోటుచేసుకుంది. పట్టణంలో కేఎంఆర్ క్రికెట్ టోర్నమెంట్ కొన్నిరోజులుగా జరుగుతోంది. ఈ టోర్నమెంట్ లో ఆడటానికి ఆంజనేయులు అనే వ్యక్తి వెళ్లాడు. ఈ క్రమంలో బౌలింగ్ చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే అప్రమత్తమైన తోటి క్రీడాకారులు సీపీఆర్ చేయడంతో పాటు హుటాహుటిన ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే అతను ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ప్రకటించారు. దీంతో స్నేహితులతో పాటు కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.

Read Also: ఓటీటీలోకి వచ్చేసిన ‘రంగమార్తాండ’ చిత్రం
Follow us on:  YoutubeInstagram Google News

 

Latest Articles

ప్రశ్న రావణ్ పై రాష్ట్రవ్యాప్తంగా ఫిర్యాదులు

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లపై సోషల్ మీడియాలో అనుచిత, అవమానకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణల నేపథ్యంలో ప్రశ్న రావణ్ పై రాష్ట్రవ్యాప్తంగా ఫిర్యాదులు కొనసాగుతున్నాయి. ఈ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్