34.2 C
Hyderabad
Thursday, May 14, 2026
spot_img

విడుదలైన తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు

స్వతంత్ర వెబ్ డెస్క్: తెలంగాణ ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్‌ ఫస్టియర్‌, సెకండియర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 12వ తేదీ నుంచి 20వ తేదీ వ‌ర‌కు జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఉదయం ఫస్టియర్‌ విద్యార్థులకు, మధ్యాహ్నం సెకండియర్‌ వారికి పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 933 పరీక్షా కేంద్రాల్లో ఈ ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించారు. ఇక.. ఇంటర్‌ ఫస్టియర్‌, సెకండియర్‌కి క‌లిపి మొత్తం 4,12,325 మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాశారు. ఇందులో ఫస్టియర్‌కి 2,70,583 మంది, సెకండియ‌ర్‌కి 1,41,742 మంది విద్యార్థులు ఈ ప‌రీక్ష‌ల‌కు హాజ‌ర‌య్యారు. ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫ‌లితాల‌ను https://tsbie.cgg.gov.in/ లేదా http://www.manabadi.co.in/ వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

ఇక ఈ ఏడాది జ‌రిగిన ఇంట‌ర్ రెగ్యుల‌ర్ ప‌రీక్ష‌ల ఫ‌లితాల్లో ఫస్టియర్‌లో 63.85 శాతం ఉత్తీర్ణ‌త‌, సెకండియర్‌ 67.26 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇందులో ఫస్టియర్‌లో బాలురు 54.66 శాతం పాసైతే, బాలికలు 68.68% ఉత్తీర్ణులయ్యారు. అలాగే సెకండియర్‌లో బాలురు 55.60% ఉత్తీర్ణులైతే, బాలికలు 71.57 శాతం పాస్‌ కావడం గమనార్హం. ఇంటర్ రెగ్యుల‌ర్ ప‌రీక్ష‌ల‌కు ఫస్టియర్‌, సెకండియర్‌ కలిపి మొత్తం 9,48,153 మంది ఇంటర్‌ పరీక్షలకు హాజరయ్యారు.

Latest Articles

ఆదాయార్జనశాఖలపై సీఎం చంద్రబాబు సమీక్ష

అమరావతి కేంద్రంగా రాష్ట్ర ఆదాయ వనరులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు( N. Chandrababu Naidu) సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ఆర్థిక స్థితి బలోపేతం, ఆదాయ వృద్ధి లక్ష్యాల సాధనపై వివిధ శాఖలకు కీలక...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్