తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. తెలంగాణ పదో ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా రాష్ట్ర అసెంబ్లీ ప్రాంగణంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ లు ఇతర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. రాజ్‌భవన్ వద్ద జాతీయ పతాకాన్ని గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల నుంచి ఆయన గౌరవ వందనం స్వీకరించారు. తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవి ర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దశాబ్ది వేడుకలు చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. అవి నీతి నిర్మూలనే మనందరి లక్ష్యమని గవర్నర్ చెప్పారు. రాష్ట్ర సచివాలయంలో సీఎస్ శాంతికుమారి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలు
0
205
Previous article
Next article
Latest Articles
సరికొత్త సంచలనాలకు తెరలేపిన బొద్దింక జనతా పార్టీ
సోషల్ మీడియాలో వైరల్ కావడం చాలా సులువు. ఈ రోజుల్లో చీఫ్ జస్టిస్ ఓ కేసు సందర్భంగా చేశారంటున్న వ్యాఖ్యల నేపథ్యాన్ని వాడుకుని గత వారంలో కొత్తగా రెండు రాజకీయ పార్టీలు ఆవిర్భవించాయి....
- Advertisement -
- Advertisement -


