Teen gives birth to baby |నేటి యువతపై సోషల్ మీడియా తీవ్ర ప్రభావం చూపుతోంది. మంచి కన్నా చెడు కోసమే సోషల్ మీడియాను వినియోగిస్తున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. టీనేజ్ వయసులోనే ప్రేమ పేరుతో కాలక్షేపాలు చేస్తూ భవిష్యత్ ను నాశనం చేసుకుంటున్నారు. మహారాష్ట్రలోని నాగ్ పూర్ కు చెందిన 15ఏళ్ల బాలికకు సోషల్ మీడియా ద్వారా ఓ యువకుడితో పరిచయం ఏర్పడింది. అనంతరం ఇద్దరు ప్రేమించుకుని శారీరకంగా దగ్గరవ్వడంతో బాలిక గర్భం దాల్చింది. పొట్ట పెరుగుతుంది ఏంటని తల్లి ప్రశ్నించగా అనారోగ్యం వల్లే అని బురిడీ కొట్టించింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో యూట్యూబ్ లో కాన్పుకు సంబంధించిన వీడియోలు చూస్తూ సొంతంగా కాన్పు చేసుకుంది. అనంతరం పుట్టిన బిడ్డను గొంతు నులిమి చంపేసింది. కుమార్తె నీరసంగా కనిపించడంతో తల్లి గట్టిగా ప్రశ్నించేసరికి అసలు విషయం వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
యూట్యూబ్ చూస్తూ కాన్పు చేసుకున్న 15ఏళ్ల బాలిక
0
370
Latest Articles
కళ్యాణ్ రామ్.. ప్లాప్ డైరెక్టర్ కి ఓకే చెప్పాడా..?
నందమూరి కళ్యాణ్ రామ్.. బింబిసార మూవీతో బ్లాక్ బస్టర్ సాధించిన తర్వాత చేసిన సినిమాలు ఏమాత్రం ఆకట్టుకోలేదు. ఇప్పుడు వెంకీతో కలిసి హిట్ మిషన్ అనిల్ రావిపూడి డైరెక్షన్లో.. చేస్తున్న క్రేజీ మల్టీస్టారర్...
- Advertisement -
- Advertisement -


