బాలయ్య కోసం ‘యానిమల్’ విలన్‌ను తెచ్చిన బాబీ

నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కుతోంది. బాలకృష్ణ 109వ సినిమా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలకృష్ణను ఢీకొట్టబోయే విలన్‌గా ఎవరు నటిస్తారనేది ఆసక్తికరంగా మారింది. అయితే పాత్రధారి ఎవరో ఇప్పుడు తెలిసిపోయింది. అతను మరెవరో కాదు.. ‘యానిమల్’ సినిమాలో విలన్‌గా నటించిన భయపెట్టిన బాలీవుడ్ నటుడు బాబీ డియోల్.

ఒకప్పుడు బాలీవుడ్లో హీరోగా అనేక సినిమాలు చేసిన బాబీ డియోలో.. మొన్నటి వరకు అవకాశాలు లేక సైలెంట్ అయిపోయాడు. ఈ మధ్యకాలంలో ఆశ్రమ్ అనే వెబ్ సిరీస్ చేసి కాస్త లైమ్ లైట్‌లోకి వచ్చాడు. ఆ తర్వాత యానిమల్ సినిమాలో అబ్రార్ పాత్రలో నటించి ఒక్కసారిగా ప్యాన్ ఇండియా లెవెల్‌లో మరోసారి పాపులర్ అయ్యాడు. నిజానికి యానిమల్ సినిమాలో ఆయన్ని పూర్తి వైలెంట్‌గా చూపించారు. అయితే నటన విషయంలో పూర్తిస్థాయిలో వాడుకోలేదనిపించింది. అయితే యానిమల్ క్రేజ్‌తో ఆయనకు పలు సౌత్ సినిమాల్లో అవకాశాలు తన్నుకొస్తున్నాయి. శనివారం ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఇప్పటికే సూర్యతో కలిసి చేస్తున్న ‘కంగువ’ సినిమా నుంచి లుక్ రిలీజ్ చేయగా.. ఇప్పుడు ఎన్‌బీకే 109 నుంచి మరొక లుక్ రిలీజ్ చేశారు.

నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్ల మీద నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. బాబీ డియోల్ పుట్టినరోజు సందర్భంగా ఆయన లుక్ రిలీజ్ చేసి సినిమాలోకి ఆహ్వానిస్తున్నట్లు వెల్కమ్ ఆన్ బోర్డు పోస్టర్ రిలీజ్ చేసింది సినిమా టీం. బాబీడియోల్ రాకతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి.

Latest Articles

సుకుమార్.. మార్పు కోరుకుంటున్నారా..?

క్రియేటీవ్ జీనియస్ సుకుమార్.. పుష్ప 2 రిలీజై సంవత్సరంన్నర అయినా ఇంత వరుకు కొత్త సినిమాని పట్టాలెక్కించలేదు. త్వరలోనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో మూవీని స్టార్ట్ చేయడానికి సుకుమార్...
- Advertisement -

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్