TDP Leader Pattabhi |టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ కు బెయిల్ మంజూరైంది. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ జిల్లా కోర్టు ఉత్తర్వులు జారీచేసింది. పోలీసులు వేసిన కస్టడీ పిటిషన్ ను తిరస్కరించింది. పట్టాభి తరపున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. ఈ కేసులో సాక్షులను ప్రభావితం చేయరాదని.. విచారణలో పోలీసులకు సహకరించాలని.. అలాగే రూ.25వేల చొప్పున ఇద్దరు షూరిటీ ఇవ్వాలని ఆదేశించారు.