‘తంత్ర’ టీజర్ లాంచ్ చేసిన ప్రియదర్శి

మల్లేశం, వకీల్‌సాబ్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న తెలుగమ్మాయి అనన్య నాగళ్ల ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘తంత్ర ‘. ఈ మూవీ టీజర్ ఈరోజు ప్రియదర్శి చేతుల మీదుగా రిలీజ్ అయ్యింది. ‘ఊరిలో పుట్టిన దుష్టశక్తి రక్తదాహంతో విరుచుకుపడుతోంది..’ అంటూ చెబుతున్న డైలాగ్ మీద కట్ అయిన టీజర్ రకరకాల తాంత్రిక పూజలని చూపిస్తూ భయపెట్టేలా ఉంది. టీజర్‌ని బట్టి ఈ సినిమాలో మన పురాతన తాంత్రిక రహస్యాలని వెలికితీస్తున్నట్టు తెలుస్తోంది. అనన్య దుష్టశక్తి బారిన పడిన అమ్మాయిగా కొత్తగా కనిపిస్తోంది. అనన్య ఇంతవరకు చెయ్యని ఒక క్రేజీ రోల్ చేస్తోందని మేకర్స్ చెబుతున్నారు. క్షుద్రపూజలు చేసే తాంత్రికుడిగా ‘టెంపర్ వంశీ’ లుక్ బాగా సెట్ అయ్యింది. సలోని పాత్ర మిస్టీరియస్‌గా కనపడుతోంది.

ప్రస్తుతం హర్రర్ ట్రెండ్ నడుస్తోంది. క్షుద్రపూజలు ఇతివృత్తంగా వస్తున్న సినిమాలు బ్లాక్‌బస్టర్ హిట్స్ కొడుతున్న టైమ్‌లో వస్తున్న ఈ మూవీ కూడా ప్రామిసింగ్‌గా కనపడుతోంది. శ్రీహరి తమ్ముడి కొడుకు ధనుష్ రఘుముద్రి ఈ మూవీతో హీరోగా పరిచయమవుతున్నాడు. సలోని ఈ సినిమాతో రీ-ఎంట్రీ ఇస్తోందని అర్ధమౌతోంది. రీసెంట్‌గా మంగళవారం సినిమాతో ఆకట్టుకున్న మీసాల లక్ష్మణ్ ఈ సినిమాలో ఒక మంచి రోల్ చేశారని తెలుస్తోంది.

ఫస్ట్ కాపీ మూవీస్, బి ద వే ఫిల్మ్స్ బ్యానర్స్ కలిసి రూపొందించిన ఈ సినిమా ఫస్ట్‌లుక్‌కి ఇప్పటికే మంచి రెస్పాన్స్ వచ్చింది. వాల్ట్‌డిస్నీలో పనిచేసిన శ్రీనివాస్ గోపిశెట్టి ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. టీజర్ చూసి ఇంప్రెస్ అయిన ప్రియదర్శి దీనిని లాంచ్ చేయడానికి ముందుకొచ్చారని మేకర్స్ తెలిపారు.

నటీనటులు:
అనన్య నాగళ్ల, ధనుష్ రఘుముద్రి, సలోని, టెంపర్ వంశీ, మీసాల లక్ష్మణ్, కుశాలిని తదితరులు

టెక్నికల్ టీం:

బ్యానర్స్: ఫస్ట్ కాపీ మూవీస్, బి ద వే ఫిల్మ్స్, వైజాగ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ

నిర్మాతలు: నరేష్ బాబు పి, రవి చైతన్య

డైరెక్టర్: శ్రీనివాస్ గోపిశెట్టి

కో-ప్రొడ్యూసర్: తేజ్ పల్లి

సినిమాటోగ్రఫి: సాయిరామ్ ఉదయ్, విజయ భాస్కర్ సద్దాల

ఆర్ట్ డైరెక్టర్: గురుమురళీ కృష్ణ

ఎడిటర్: ఎస్.బి ఉద్ధవ్

మ్యూజిక్: ఆర్ ఆర్ ధృవన్

సౌండ్ డిజైన్: జ్యోతి చేతియా

సౌండ్ మిక్సింగ్: శ్యామల్ సిక్దర్

VFX: ఎ నవీన్

DI కలరిస్ట్: పివిబి భూషణ్

పీఆర్వో: మధు వీఆర్

Latest Articles

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్