మహాశివరాత్రి సందర్భంగా తిరుపతిలో ఆధ్యాత్మిక గురువు, శ్రీ ఆత్మానందమయి ఆధ్వర్యంలో సుషుమ్న క్రియా మహాధ్యానం జరుగుతుంది. తిరుపతి తారకరామ స్టేడియంలో ఈనెల 26 సాయంత్రం నుండి 27వ తేదీ ఉదయం వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. బాబాజీ సుషుమ్న క్రియాయోగ ఫౌండేషన్, ఎస్‌వీ యూనివర్సిటీ సంయుక్త నిర్వహణలో జరగనుంది. సుషుమ్న క్రియాయోగ సాధనపై పలు సూక్ష్మాలను ఆత్మానందమయి తెలియజేస్తారు. ఒత్తిడిని తట్టుకోగల శక్తి, నైపుణ్యం, మానసిక ప్రశాంతత కలగజేసే ప్రభావంతమైన ప్రక్రియ సుషుమ్న క్రియా యోగ ధ్యానం అని నిర్వాహకులు తెలిపారు. సుషుమ్న క్రియా యోగ దీక్ష, మహా లింగ బిల్వార్చన, భక్తి సంగీత, నృత్య కార్యక్రమాలు, మహా లింగోద్భవ ధ్యానం, రుద్రాక్ష వితరణ జరుగుతుంది.