ఏపీలో స్కూల్స్ ఒకరోజు ఆలస్యంగా తెరుచుకోనున్నాయి. ప్రభుత్వం స్కూల్ వేసవి సెలవులు పొడిగిం చింది. జూన్ 12న పాఠశాలలు రీఓపెన్ చేయాల్సి ఉండగా జూన్ 13న ఓపెన్ చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. జూన్ 12న ముఖ్య మంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం ఉండటంతో పాఠశాలలకు వేసవి సెలవులను పొడిగించింది. దీంతో జూన్ 13న పాఠశాలలు తెరవనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి ఏడాది జూన్ 11 వరకు వేసవి సెలవులు ఉంటాయి. జూన్ 12న పాఠశాల లు పున:ప్రారంభం అవుతాయి. రాష్ట్రంలోని పాఠశాలలకు ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు దాదాపు 50 రోజుల పాటు విద్యా శాఖ వేసవి సెలవులు ప్రకటించింది. సెలవుల అనంతరం 2024-25 విద్యా సంవ త్సరానికి గానూ జూన్ 13 నుంచి స్కూళ్లు తిరిగి తెరుచుకోనున్నాయి.
ఏపీలో వేసవి సెలవులు పొడిగింపు
0
192
Previous article
Next article
Latest Articles
జనసేన ఓట్ల వ్యూహానికి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుండగా.. బీజేపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల...
- Advertisement -
- Advertisement -


