బాలయ్య డైలాగ్స్‌తో ఆకట్టుకున్న ఆసీస్ స్టార్ క్రికెటర్

స్వతంత్ర వెబ్ డెస్క్: ఆసీస్ స్టార్‌ క్రికెటర్‌ స్టీవ్‌ స్మిత్‌ తెలుగు సినిమాల్లోని డైలాగులు చెప్పి అభిమానులను అలరించాడు. లండన్‌ వేదికగా భారత్‌తో జరగుతున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్లో బీజీగా ఉన్న స్మిత్‌.. ఖాళీ సమయంలో స్టార్‌స్పోర్ట్స్‌-1 తెలుగు యాంకర్ తో కాసేపు మాట్లాడాడు. ఈ క్రమంలో యాంకర్‌ చెప్పిన డైలాగ్‌లను స్మిత్‌ తనదైన స్టైల్‌లో చెప్పి నవ్వులు తెప్పించాడు. మన టాలీవుడ్ లెజెండ్ హీరో నందమూరి నట సింహం బాలకృష్ణ డైలాగ్‌లను స్టీవ్ స్మిత్‌ తనదైన మేనరిజంతో చెప్పుకొచ్చాడు.

”అపాయింట్‌మెంట్ లేకుండా వస్తే వకేషన్ చూడను, లొకేషన్ చూడను, డోంట్ ట్రబుల్ ది ట్రబుల్. ఇఫ్ యు ట్రబుల్ ది ట్రబుల్.. ట్రబుల్ ట్రబుల్స్ యు.. ఐయామ్ నాట్ ది ట్రబుల్, ఐయామ్ ట్రుత్” వంటి డైలాగ్‌లు స్మిత్‌ నోటి నుంచి వచ్చాయి. ఇక అదే విధంగా లాస్ట్ కు యాంకర్ ‘తగ్గేదేలే’ అంటూ అల్లు అర్జున్ పుష్ప డైలాగ్ ను చెప్పడంతో దాన్ని తన స్టైల్ లో స్టీవ్ స్మిత్ చెప్పాడు. ఇందుకు సంబంధించిన వీడియోను స్టార్‌స్పోర్ట్స్‌-1 ‍ట్విటర్‌ అకౌంట్ లో షేర్‌ చేసింది. దీంతో ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ఆస్ట్రేలియా ఆధిపత్యం కొనసాగుతోంది.

Latest Articles

పుల్వామా దాడుల సూత్రధారి హతం

పుల్వామా దాడుల వెనుక కీలక సూత్రధారిగా ఉన్న మోస్ట్‌ వాంటెడ్ ఉగ్రవాది హంజా బుర్హాన్ హతమయ్యాడు. పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ముజఫరాబాద్‌లో హంజా బుర్హాన్‌ హతమైనట్టు తెలుస్తోంది. గుర్తు తెలియని వ్యక్తులు టెర్రరిస్ట్‌ హంజా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్