26.2 C
Hyderabad
Saturday, July 13, 2024
spot_img

విభజన సమస్యల పరిష్కార దిశగా ఏపీ, తెలంగాణ సీఎంల ముందడుగులు

   ఏపీ, తెలంగాణ మధ్య సమస్యల పరిష్కారానికి నిరంతరం చర్చలు జరుగుతాయని ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రితో తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్ భేటీ కావడం చర్చలు జరపడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఒకదాని వెంట మరోటి అన్నట్లుగా జరిగిన రాజకీయ పరిణామాలు చూస్తే, ఏపీ, తెలంగాణ మధ్య విభజన సమస్యల పరిష్కారానికి ముందడుగు పడినట్లే కన్పిస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీ పునర్విభజన చట్టంలో పేర్కొ న్నట్లుగా రెండు రాష్ట్రాల మధ్య పెండింగ్‌ లో ఉన్న పలు సమస్యలు మరోసారి తెరపైకి వచ్చాయి.

   ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ కాస్తా ఏపీ, తెలంగాణగా విడిపోయి పదేళ్లయింది. కానీ, రెండు రాష్ట్రాల మధ్యా ఇప్పటికీ పరిష్కా రం కాని సమస్యలు ఎన్నో ఉన్నాయి. వీటిని పరిష్కరించుకునేందుకు 2014, 2019లో రెండు రాష్ట్రాలకు సంబంధిం చిన ముఖ్యమంత్రులు దృష్టి సారించారు. కొన్నింటిని పరిష్కరించారు. కానీ, ఇంకా అపరిష్కృతంగా ఉన్న సమస్యలు పెద్ద ఎత్తున ఉన్నాయి. ఇప్పుడు ఏపీ, తెలంగాణలో కొత్త ప్రభుత్వాలు ఉండడం, అందులోనూ ఏపీ, తెలంగాణ సీఎంల మధ్య మంచి అనుబంధం ఉండడంతో అందరి చూపూ ఇప్పుడు వారిపైనే నెలకొంది. ఇందుకు తగ్గట్లుగానే తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి ఢిల్లీలో చేసిన వ్యాఖ్యలు ఉన్నాయి అన్న వాదన విన్పిస్తోంది. పునర్విభజన చట్టం ప్రకారం కేంద్రం నుంచి రాబట్టుకోవాల్సిన నిధుల కోసం, పొరుగు రాష్ట్రంతో సమస్యల పరిష్కారం కోసం నిరంతరం చర్చల ప్రక్రియ కొనసాగుతుందని వెల్లడించారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఆంధ్రప్రదేశ్‌ కోసం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంత నిబద్దతతో పని చేస్తారో.. తెలంగాణ విషయంలో తాను అదే విధంగా ప్రయత్నిస్తాన న్నారు రేవంత్ రెడ్డి.

  సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఇలాంటి వ్యాఖ్యలు చేసిన కొన్ని గంటల్లోనే తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్ అమరావతి వెళ్లి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఇంకా అపరిష్కృతంగా ఉన్న విభజన సమస్యలు, పెండింగ్‌ అంశాలపై చర్చ జరిగినట్లు ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలోనే అసలు రెండు రాష్ట్రాల మధ్యా అపరిష్కృతంగా ఉన్న కొన్ని సమస్యలు, అంశాలను ఓసారి పరిశీలిస్తే, లిస్ట్ చాలా పెద్దదే కన్పిస్తుంది. ప్రధానంగా విభజన చట్టంలోని షెడ్యూలు9, షెడ్యూల్ 10లో పేర్కొన్న వివిధ సంస్థలు, కార్పొరేషన్ల విభజన ఇంకా పూర్తికాలేదు. ఇందుకు ప్రధాన కారణం పలు అంశాలపై ఇరు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడమేనని చెప్పాలి. ఏపీ ప్రభుత్వ పునర్విభజన చట్టం ప్రకారం 89 ప్రభుత్వ కంపెనీ లు, కార్పొరేషన్లను తొమ్మిదవ షెడ్యూల్‌లో పొందుపరిచారు. వాటిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విత్తనాల అభి వృద్ధి కార్పొరేషన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ పారిశ్రామక అభివృద్ధి కార్పొరేషన్, ఆంధ్రప్రదేశ్ గిడ్డం గుల కార్పొరేషన్ వంటి ప్రభుత్వ ఆధ్వర్యంలోని కంపెనీలు, కార్పొరేషన్లు ఉన్నాయి.

ఇక, పదో షెడ్యూల్‌లో ఏపీ రాష్ట్ర సహకార యూనియన్, పర్యావరణ రక్షణ శిక్షణ పరిశోధనా సంస్థ, ఏపీ అటవీ అకాడ మీ, సత్పరిపాలన కేంద్రం, ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ లాంటి 107 శిక్షణా సంస్థలు, కేంద్రాలు ఉన్నాయి. రిటైర్డ్ అధికారి షీలా భిడే సారథ్యంలోని నిపుణుల కమిటీ షెడ్యూలు 9, 10 సంస్థల విభజనపై సిఫార్సులు చేసినా ఇప్పటికీ అవి అపరిష్కృతంగానే ఉన్నాయి. అటు.. ప్రభుత్వ ఆధీనంలోని రోడ్డు రవాణా సంస్థ ఆస్తులపై రెండు రాష్ట్రాల మధ్య విబేధాలు ఇంకా కొలిక్కి రాలేదు. ఇలా ఒకటీ రెండూ కాదు.. రెండు తెలుగు రాష్ట్రాల మధ్యా ఇంకా పూర్తికాని ఆస్తుల పంపకాలు చాలా ఉన్నాయి. ఇప్పటికే రేవంత్ రెడ్డి నుంచి విభజన సమస్యల పరిష్కారానికి ముందడుగు పడడం, తెలంగాణ గవర్నర్‌ స్వయంగా సీఎం చంద్రబాబుతో భేటీ కావడం అటు చంద్రబాబు నుంచి సానుకూల సంకేతాలు రావడం తో రాబోయే రోజుల్లో ఈ దిశగా మరిన్ని చర్యలు ఉంటాయని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇక మిగిలిందల్లా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకచోట కూర్చొని సమస్యలు పరిష్కరించకోవడమేనన్న వాదన విన్పిస్తోంది.

Latest Articles

రాజ్‌ తరుణ్‌- లావణ్య కేసులో మరో ట్విస్ట్‌

తనను ప్రేమించి మోసం చేశాడంటూ నటుడు రాజ్‌తరుణ్‌పై ఇటీవల ఫిర్యాదు చేసిన లావణ్య.. ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ అర్ధరాత్రి తన అడ్వకేట్‌కు మెసేజ్ పంపారు. తాను వెళ్లిపోతున్నానంటూ అందులో పేర్కొన్నారు. దీంతో అడ్వకేట్‌ .....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్