ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌లో భాగంగా జరిగిన హింసాత్మక ఘటనలపై సిట్ దర్యాప్తు ప్రారంభించనుంది. క్షేత్రస్థాయిలో ఆయా ప్రాంతాల్లో పర్యటించి నివేదిక తయారు చేయనుంది. అంతుకు ముందు సిట్ అధికారులు భేటీ కానున్నారు. మాచర్ల, గురజాల, నరసరావుపేట, చంద్రగిరి, జమ్మల మడుగు, తాడిపత్రిలో ఎన్నికల రోజు, పోలింగ్ అనంతరం హింసాకాండ ఘటనలు జరిగాయి. ఆయా ప్రాంతాల్లో ఘటనపై ఎంక్వైరీ చేయనుంది సిట్. రెండు రోజుల్లో కేంద్ర ఎన్నికల కమిషన్‌ను సిట్ నివేదిక ఇవ్వనుంది.
ఐజీ వినీత్ బ్రిజ్ లాల్ నేతృత్వంలో 13 మంది అధికారులతో కూడిన సిట్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సిట్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. హింసాత్మక ఘటనలపై దర్యాప్తు ప్రారంభించిన సిట్ రెండో రోజుల్లో కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక సమర్పించ నుంది.సిట్‌లో సభ్యులుగా ఏసీబీ ఎస్పీ రమాదేవి, అడిషనల్ ఎస్పీ సౌమ్యలత, ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి, సీఐడీ డీఎస్పీ శ్రీనివాసులు, డీఎస్పీలు వీ శ్రీనివాసరావు, రవి మనోహర చారి, ఇన్స్పెక్టర్లు భూషణం, వెంకట రావు, రామకృష్ణ, జి ఐ శ్రీనివాస్, ఎన్ ప్రభాకర్, శివ ప్రసాద్‌లు నియామకమయ్యారు. ఎన్నికల వేళ పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో హింసపై సిట్ దర్యాప్తు చేయనుంది. ఎన్నికల అనంతర హింసలో పోలీస్ అధికారులు పాత్రపైన విచారణ జరపనుంది. రెండు రోజుల్లో సిట్ నివేదిక ఇవ్వాలని ఈసీ ఆదేశించింది.


