23.2 C
Hyderabad
Tuesday, February 10, 2026
spot_img

సింగరేణి సమరం

తెలంగాణ అంతటా విద్యుత్ వెలుగులు నింపడంలో అత్యంత కీలకమైనది సింగరేణి. మరి ఇలాంటి సంస్థ ఎన్నికలంటే వ్యవహారం మామూలుగా ఉండదు కదా. సరిగ్గా ఈసారి కూడా ఇదే మాదిరిగా నడిచింది. రాష్ట్ర హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈనెల 27న సంస్థ గుర్తింపు సంఘం ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం మొత్తం 13 సంఘాలు బరిలో నిలిచాయి.

ఆరు జిల్లాల పరిధిలో విస్తరించిన సింగరేణిలో మొత్తం 39 వేల 748 మంది ఓటర్లున్నారు. దీంతో.. ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి అన్ని పార్టీలు. పైగా ఇటీవలె తెలంగాణలో అధికారం కూడా మారడంతో సింగరేణిపై పట్టు ఎవరికి చిక్కుతుందన్న దానిపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.

ఇప్పటికే అన్ని సంఘాలు పోటాపోటీగా ప్రచారం నిర్వహించాయి. అయితే.. ఇప్పటి వరకు గుర్తింపు సంఘంగా ప్రాతినిధ్యం వహించిన TBGKS అగ్ర నేతల రాజీనామాలతో చతికిల పడింది. దీంతో పోటీ ప్రధానంగా AITUC, INTUC యూనియన్ల మధ్యే కొనసాగుతుందన్న వాదన బలంగా విన్పిస్తోంది.

ఇప్పటికే తమ వంతు ప్రయత్నాలు జోరుగా చేశాయి రాజకీయ పార్టీలు, గుర్తింపు సంఘాలు. ఎక్కడికక్కడ మైన్ల వద్ద గేట్ మీటింగ్‌లతో హోరెత్తించారు నేతలు. AITUC తరుపున కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావు, INTUC తరుపున కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గనులపై మీటింగ్‌లు ఏర్పాటు చేయడంతోపాటు బహిరంగ సభలు పెట్టి తమ యూనియన్లను గెలిపించాలని కోరారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడంతో సింగరేణిలో సైతం కాంగ్రెస్ అనుబంధ సంఘమైన INTUCని గెలిపించుకోవాలని హస్తం పార్టీ భావిస్తోంది. దీంతో..సింగరేణి ప్రాంతాల్లోని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకట స్వామి, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావ్‌‌లు ప్రచారం ముమ్మరంగా చేశారు.

ప్రచార పర్వం పూర్తి కావడంతో ఆఖరి ప్రయత్నాల్లో ఉన్నాయి రాజకీయ పార్టీలు, గుర్తింపు సంఘాలు. వాస్తవానికి గత ఏడాదిన్నర కాలంగా ఈ ఎన్నికలు వాయిదా పడుతూ వస్తున్నాయి. దీంతో..ఎలక్షన్ల కోసం న్యాయ పోరాటాన్ని కొనసాగించాయి కార్మిక సంఘాలు. ఎట్టకేలకు కోర్ట్ ఆదేశాలతో ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. సింగరేణిలో ఇప్పటి వరకు 6 సార్లు గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు జరిగాయి. వీటిలో సీపీఐ అనుబంధ కార్మిక సంఘం AITUC మూడు సార్లు, కాంగ్రెస్ అనుబంధ ఐఎన్‌టీయూసీ ఓసారి, బీఆర్ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం రెండు సార్లు విజయం సాధించాయి. ప్రస్తుత ఎన్నికల్లో 13 కార్మిక సంఘాలు గుర్తింపు హోదా కోసం పోటీ పడుతున్నాయి.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్