ఏపీలో పదేళ్లపాటు పరిపాలన చేసిన టీడీపీ, వైసీపీతో రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరుగలేదని కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. కర్నూలు జిల్లాలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో టీడీపీ, వైసీపీలపై షర్మిల విరుచుకుపడ్డారు. ఒక్క అవకాశమంటూ అనేక హామీలతో అధికారంలోకి వచ్చిన జగన్ ఐదేళ్లలో ఒక్క పనిని పూర్తి చేయలేక పోయారని విమర్శించారు. తండ్రి వైఎస్సార్ ప్రారంభిం చిన గుండ్రేవుల ప్రాజెక్టును కుమారుడు జగన్ పెండింగ్‌లో పెట్టారని మండిపడ్డారు. కర్నూలులో న్యాయ రాజధాని కడుతామని ఇచ్చిన హామీని నెరవేర్చలేదని దుయ్యబట్టారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించలేకపోయారని వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉద్యోగ కల్పనలో మోసం చేసిందని ఆరోపించారు.
టీడీపీ, వైసీపీలపై షర్మిల ఫైర్
0
170
Previous article
Latest Articles
తెలంగాణలో రసవత్తరంగా ఆస్తుల ప్రదర్శన
తెలంగాణ రాష్ట్రం వచ్చి పన్నెండేళ్లు అవుతున్న సందర్భంగా మన రాజకీయ నాయకులు ఎంతగా అభివృద్ధి చెందారో ఇప్పుడు ప్రజలకు కళ్లకు కట్టినట్లు అర్థమవుతోంది. రాష్ట్రం ఏమో కానీ నాయకుల భూబ్యాంకులు మాత్రం ఎకాయెకిన...
- Advertisement -
- Advertisement -


