YS Sharmila | వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లోటస్ పాండ్ నుంచి బయటకు వస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో వాగ్వాదానికి దిగిన షర్మిల… నన్నెందుకు అరెస్ట్ చేశారు? సొంత పనులకు కూడా బయటకు వెళ్లకుండా అడ్డుకుంటారా? అంటూ ప్రశ్నించింది. తనను హౌస్ అరెస్ట్ చేయడానికి మీకు ఏమి అధికారం ఉందని పోలీసులను షర్మిల ప్రశ్నించింది. పోలీసులు అడ్డుకుంటున్నా… వారిని తోసేసి మరీ షర్మిల బయటకు వచ్చారు. ఆ తరువాత అక్కడే రోడ్డుపై బైఠాయించారు. దీంతో లోటస్ పాండ్ వద్ద పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. షర్మిలకు, పోలీసులకు జరిగిన స్వల్ప వాగ్వాదంలో అడ్డొచ్చిన మహిళా కానిస్టేబుల్ చెంపపై షర్మిల కొట్టినట్టు సమాచారం. అంతేకాకుండా ఓ ఎస్సైపై కూడా షర్మిల చేయి చేసుకున్నట్లు తెలుస్తోంది. చివరకు మహిళా పోలీసులు షర్మిలను బలవంతంగా అరెస్ట్ చేసి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.
ఎస్సై, కానిస్టేబుల్ పై చేయి చేసుకున్న వై.ఎస్. షర్మిల
0
300
Previous article
Latest Articles
సుకుమార్.. మార్పు కోరుకుంటున్నారా..?
క్రియేటీవ్ జీనియస్ సుకుమార్.. పుష్ప 2 రిలీజై సంవత్సరంన్నర అయినా ఇంత వరుకు కొత్త సినిమాని పట్టాలెక్కించలేదు. త్వరలోనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో మూవీని స్టార్ట్ చేయడానికి సుకుమార్...
- Advertisement -
- Advertisement -


