26.1 C
Hyderabad
Friday, March 6, 2026
spot_img

షారూఖ్ ఖాన్ ‘జవాన్’ నుంచి పార్టీ సాంగ్ రిలీజ్

బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్ ఖాన్ కథానాయకుడిగా అట్లీ దర్శకత్వంలో రూపొందిన భారీ బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ ‘జవాన్’. హ్యూజ్ ఎక్స్‌పెక్టేషన్స్‌తో సెప్టెంబర్ 7న రిలీజ్ అవుతోన్న ఈ సినిమా నుంచి ‘నాట్ రామయ్యా వస్తావయ్యా’ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. రీసెంట్‌గా #AskSRK సెషన్‌లో షారూఖ్ తన అభిమానులతో మాట్లాడుతూ ‘నాట్ రామయ్యా వస్తావయ్యా’ సాంగ్ గ్లింప్స్‌ను విడుదల చేసి ఆశ్చర్యంలో ముంచెత్తారు. దీంతో మూడో సాంగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. ఎట్టకేలకు ఈ నిరీక్షణకు తెరపడుతూ ‘నాట్ రామయ్యా వస్తావయ్యా..’ సాంగ్ విడుదలైంది.

ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్లు ‘నాట్ రామయ్య వస్తావయ్యా’ను అద్భుతంగా తెరకెక్కించారు. పాట చూస్తుంటే పార్టీ నెంబర్‌‌లా ఉంది. ప్రోమోలో షారూఖ్ ఎనర్జీ, ఛార్మ్ అందరినీ ఆకట్టుకున్నాయి. ఇప్పుడు సాంగ్‌లో అది రెట్టింపుగా కనిపిస్తోంది. డాన్స్ మూవ్స్ ట్రెండ్ సెట్టింగ్‌గా ఉన్నాయి. పాటను హిందీ, తెలుగు, తమిళ భాషల్లో మేకర్స్ విడుదల చేశారు. సాంగ్ పార్టీ వైబ్స్‌తో అలరిస్తుంది.

హిందీ వెర్షన్‌లో ‘నాట్ రామయ్యా వస్తావయ్యా’ పాటకు అనిరుద్ రవిచందర్ సంగీతాన్ని అందించారు. పాటకు కుమార్ సాహిత్యాన్ని అందించారు. అనిరుద్, విశాల్ డడ్లాని, శిల్పా రావు పాటను తమదైన స్టైల్లో అద్భుతంగా ఆలపించారు. వైభవ్ మర్చంట్ పాటకు కొరియోగ్రఫీని అందించారు. తెలుగు వెర్షన్ పాటను ఆస్కార్ విన్నర్ చంద్రబోస్ రాయగా శ్రీరామచంద్ర, రక్షిత సురేష్, అనిరుద్ పాడారు. ఇక తమిళ వెర్షన్ సాంగ్‌కు వివేక్ సాహిత్యాన్ని అందించారు. అనిరుద్, శ్రీరామ్ చంద్ర, రక్షిత సురేష్ పాటను పాడారు.

షారూఖ్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న ‘జవాన్’ చిత్రాన్ని రెడ్ చిల్లీస్ ఎంట‌ర్‌టైన్మెంట్ బ్యాన‌ర్‌పై అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో గౌరీ ఖాన్ నిర్మిస్తున్నారు. గౌర‌వ్ వ‌ర్మ ఈ సినిమాకు స‌హ నిర్మాత‌. సెప్టెంబ‌ర్ 7న ఈ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా హిందీ, తెలుగు, త‌మిళ భాషల్లో రిలీజ్ అవుతుంది.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్