స్వతంత్ర వెబ్ డెస్క్: చంద్రబాబుకు అరెస్ట్ కు నిరసనగా తెలుగుదేశం పార్టీ వినూత్న కార్యక్రమాలతో ముందుకు పోతోంది. ఇప్పటికు మోత మోగిద్దాం, కాంతితో క్రాంతి కార్యక్రమాలతో చంద్రబాబుకు సంఘీభావం తెలిపిన టీడీపీ శ్రేణులు… నేడు ‘న్యాయానికి సంకెళ్లు’ కార్యక్రమం చేపట్టేందుకు సిద్ధమయ్యాయి. దీనిపై నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణి స్పందించారు. “నేటి రాత్రి 7 గంటల నుంచి 7.05 గంటల వరకు ఐదు నిమిషాల పాటు మీ చేతులను తాళ్లు లేదా రిబ్బన్లతో కట్టివేసుకుని సంకెళ్లలాగా ప్రదర్శించండి… ఇళ్ల నుంచి బయటికి వచ్చి, లేదా బాల్కనీల్లోకి వచ్చి ఆ సంకెళ్లను ప్రదర్శించండి… ‘న్యాయానికి సంకెళ్లు’ ఇంకెన్నాళ్లని వ్యవస్థలను నిలదీద్దాం అని వారు పిలుపునిచ్చారు. ‘న్యాయానికి సంకెళ్లు’ కార్యక్రమంలో పాల్గొన్నవారు తమ ఫొటోలను, వీడియోలను సోషల్ మీడియాలో పంచుకోవడం ద్వారా రాష్ట్రంలో నిజాయతీకి గ్రహణం పట్టిన విషయాన్ని ప్రపంచానికి తెలియచెప్పండి… ‘బాబుతో నేను’ అంటూ ప్రకటించండి” అని భువనేశ్వరి, బ్రాహ్మణి కోరారు.