ఏప్రిల్ 30 సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ ‘కిల్లర్’ గ్లింప్స్ రిలీజ్

“శుక్ర”, “మాటరాని మౌనమిది”, “ఏ మాస్టర్ పీస్” వంటి డిఫరెంట్ సినిమాలతో మూవీ లవర్స్ ను ఆకట్టుకుంటున్న దర్శకుడు పూర్వాజ్ మరో సెన్సేషనల్ సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ “కిల్లర్” సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఈ చిత్రంలో పూర్వాజ్ హీరోగా నటిస్తుండగా, జ్యోతి పూర్వజ్ హీరోయిన్ గా నటిస్తోంది. విశాల్ రాజ్, గౌతమ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. థింక్ సినిమా బ్యానర్ పై ఏయు అండ్ ఐ, మెర్జ్ ఎక్స్ ఆర్ సంస్థలతో కలిసి పూర్వాజ్, ప్రజయ్ కామత్, ఎ. పద్మనాభ రెడ్డి నిర్మిస్తున్నారు.

“కిల్లర్” పార్ట్ 1 డ్రీమ్ గర్ల్ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ప్రస్తుతం ప్యాచ్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ నెల 30న ఈ సినిమా గ్లింప్స్ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ తాజాగా ప్రకటించారు. సరికొత్త సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ గా లవ్, రొమాన్స్, రివేంజ్, ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్, థ్రిల్లర్ అంశాలతో ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసేందుకు “కిల్లర్” పార్ట్ 1 డ్రీమ్ గర్ల్ మూవీ ముస్తాభవుతోంది. ఈ సినిమాను త్వరలోనే గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

నటీనటులు – జ్యోతి పూర్వజ్, పూర్వాజ్, రైజింగ్ స్టార్ దశరధ, విశాల్ రాజ్, చందూ, గౌతమ్, తదితరులు

టెక్నికల్ టీమ్
సినిమాటోగ్రఫీ: జగదీశ్ బొమ్మిశెట్టి
మ్యూజిక్: అషీర్ ల్యూక్, సుమన్ జీవరత్నం
వీఎఫ్ఎక్స్ – వర్చువల్ ప్రొడక్షన్: మెర్జ్ ఎక్స్ ఆర్
పీఆర్ఓ: జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
బ్యానర్స్ – థింక్ సినిమా, మెర్జ్ ఎక్స్ ఆర్, ఏయు అండ్ ఐ

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: దశరధ
నిర్మాతలు – పూర్వాజ్, ప్రజయ్ కామత్, ఎ. పద్మనాభ రెడ్డి
రచన, దర్శకత్వం – పూర్వాజ్

Latest Articles

తెలంగాణ ప్రజల మధ్య చిచ్చు పెడతామంటే ఊరుకునేది లేదు- కవిత

ఏపీ నేతలపై తెలంగాణ రక్షణసేన అధ్యక్షురాలు కవిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 13 ఏళ్లయినా ఏపీలో కనీసం రాజధాని కట్టుకోలేదని విమర్శించారు. తెలంగాణలో నవనిర్మాణం పేరుతో పవన్‌ కళ్యాణ్‌ సభ పెడతారని అంటున్నారని...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్