37.1 C
Hyderabad
Friday, May 16, 2025
spot_img

సమంత నిర్మించిన ‘శుభం’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

ప్రముఖ నటి సమంత నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే. సమంత సొంత ప్రొడక్షన్ కంపెనీ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద శుభం అనే సినిమాను నిర్మించారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన విడుదల తేదీని ప్రకటించారు. శుభం చిత్రాన్ని మే 9న శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయబోతోన్నట్టుగా ప్రకటించారు. ఆల్రెడీ శుభం టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. సెన్సిబుల్, హ్యూమర్‌తో శుభం చిత్రం అందరినీ పాత కాలానికి తీసుకు వెళ్లేలా ఉంది. ఫ్యామిలీ మొత్తం కలిసి చూడదగ్గ చిత్రంగా ‘శుభం’ను మేకర్లు రూపొందించినట్టుగా కనిపిస్తోంది.

ఈ చిత్రానికి యువ ప్రతిభావంతులంతా కలిసి పని చేశారు. వివేక్ సాగర్ ఆకర్షణీయమైన నేపథ్య సంగీతం, క్లింటన్ సెరెజో అందించిన మెలోడీ పాటలు ఈ చిత్రానికి హైలెట్ కాబోతోన్నాయి. ఆకర్షణీయమైన కథ చెప్పడంలో ‘శుభం’ సినిమాతో నిర్మాణంలోకి అడుగు పెట్టిన సమంత నిబద్దత అందరికీ అర్థం అవుతోంది. ‘ట్రా లా లా మూవింగ్ పిక్చర్స్‌తో వినోదాన్ని అందించే చిత్రాలను రూపొందించడమే తన లక్ష్యం. ‘శుభం’ ఆ కోవలోకి చెందే చిత్రం అవుతుంది. ‘శుభం’ కోసం తన టీం ఎంతో కష్టపడింది. ఈ ప్రత్యేకమైన కథను అందరితో పంచుకోవడానికి మేము సంతోషిస్తున్నాము’ అని సమంత అన్నారు. మే 9న ప్రపంచవ్యాప్తంగా ‘శుభం’ విడుదలకు సిద్ధమవుతోంది. ఇది ప్రేక్షకులను పూర్తిగా సంతృప్తిపరిచే చిత్రం అవుతుందని మేకర్లు చెబుతున్నారు. ట్రా లా లా మూవింగ్ పిక్చర్స్ నుంచి మరిన్ని ఎంటర్టైన్మెంట్ చిత్రాలు రానున్నాయని, ఇలానే వినోదాన్ని అందిస్తామని మేకర్లు చెబుతున్నారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్