సమంత మంచి మనసున్న వ్యక్తి: నాగ చైతన్య

స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: హీరోయిన్ సమంత పై.. అక్కినేని వారసుడు, హీరో నాగ చైతన్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. సమంత మంచి మనసున్న వ్యక్తి అని అన్నారు. జీవితంలో ఆమె ఎప్పుడూ సంతోషంగానే ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. విడుదలకు సిద్దమైన తన కొత్త చిత్రం ‘కస్టడీ’ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సమంతతో విడాకులపై నాగచైతన్య స్పందించారు. తాము విడిపోయి రెండేళ్లు అవుతోందని.. చట్టప్రకారం విడాకులు తీసుకుని ఒక సంవత్సరం అవుతుందని అన్నారు. కోర్టు కూడా మాకు విడాకులు మంజూరు చేసిందని అన్నారు. ప్రస్తుతం తాము కెరియర్ పై ద్రుష్టి పెట్టి ముందుకు సాగిపోతున్నామని అన్నారు. అయితే.. జీవితంలోని ప్రతి దశను నేను గౌరవిస్తున్నానని చై అన్నారు.

సమంతపై ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నలకు చై సమాధానం చెప్తూ.. “సమంత మంచి మనిషి. ఆమె ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. సోషల్ మీడియాలో వచ్చిన గాసిప్స్ వల్లే మా మధ్య పరిస్థితులు ఇబ్బందికరంగా మారాయి” అని అన్నారు. అందువల్లే ఒకరిపై ఒకరికి గౌరవం లేనట్లు ప్రజల్లోకి వెళ్లిందని తెలిపారు. ఈ విషయం నన్ను చాలా బాధపెట్టింది. ఇంకో చెత్త విషయం ఏంటంటే.. నా గతంతో సంబంధం లేని మూడో వ్యక్తిని ఇందులోకి తీసుకొచ్చి వార్తలు రాయడం. దీనివల్ల ఆ మూడో వ్యక్తిని అగౌరవపరచినట్లు అయ్యిందని మసుసులో మాటను పంచుకున్నారు చై.

Latest Articles

తెలంగాణలో భూ అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనలపై ప్రత్యేక కమిటీ

తెలంగాణలో భూ అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనలపై ప్రత్యేక కమిటీని నియమించింది ప్రభుత్వం. విచారణకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తూ జీఓ 134 జారీ చేసింది. ఐఏఎస్ అధికారి ఏ. శ్రీదేవసేన చైర్‌ పర్సన్‌గా,...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్