కేసీఆర్ తరహాలోనే రేవంత్ పాలన సాగుతోంది – కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

కేసీఆర్ తరహాలోనే రేవంత్ పాలన కూడా సాగుతోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అవే అబద్ధాలు, అరాచకాలు అంటూ మండిపడ్డారు. రైతులకు ఇచ్చిన ఒక్క హామీని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేదని అన్నారు. బోనస్ అని.. బోగస్ మాటలు చెప్పి కాంగ్రెస్ గెలిచిందని విమర్శించారు. MIM అధినేత అసదుద్దీన్ ఒవైసీ సోదరుల డైరెక్షన్‌లోనే రాష్ట్రంలో పోలీసు నియామకాలు బదిలీలు జరుగుతున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ చర్యల వల్లే వికారాబాద్‌లో కలెక్టర్‌పై దాడి జరిగిందని మండిపడ్డారు కిషన్ రెడ్డి. కక్ష సాధింపు చర్యలతో రాష్ట్రంలో అభివృద్ధి కుంటు పడుతోందని అన్నారు. కాంగ్రెస్‌కు ఏకైక ఏటీఎమ్‌గా తెలంగాణ మారిందని ఆరోపించారు.

మూసీ పునరుజ్జీవనానికి బీజేపీ వ్యతిరేకం కాదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. మూసీ అభివృద్ధి కార్యచరణ, DPR లేదని అన్నారు. హైదరాబాద్‌లో ఇళ్లు కూలుస్తూ.. నల్లగొండలో రైతులను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. హైదరాబాద్‌లో పేదల ఇళ్లు కూల్చొద్దు అంటే.. బుల్డోజర్లతో తొక్కిస్తానని సీఎం రేవంత్ బెదిరిస్తున్నారని మండిపడ్డారు. పేదల కోసం చావడానికైనా సిద్ధమని కిషన్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన సవాల్‌ను స్వీకరిస్తున్నామని తెలిపారు. పేదల ఇళ్లు కూల్చకుండా ప్రక్షాళన చేస్తే తప్పకుండా మద్దతిస్తామని తెలిపారు. కేటీఆర్‌ను అరెస్ట్ కాకుండా బీజేపీ అడ్డుకుంటుందనేది అసత్య ప్రచారం అని కొట్టిపారేశారు.

Latest Articles

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్