Revanth Reddy: కేసీఆర్ పై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..!

స్వతంత్ర వెబ్ డెస్క్: వర్షాలు, వరదలపై వాతావరణశాఖ ముందస్తు హెచ్చరికలను తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోలేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఉప్పల్ లో పర్యటించిన రేవంత్ రెడ్డి సర్కార్ తీరుపై నిప్పులు చెరిగారు. వర్షాలు, వరదలపై వాతావరణశాఖ ముందస్తు హెచ్చరికలను తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోలేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఉప్పల్ లో పర్యటించిన రేవంత్ రెడ్డి సర్కార్ తీరుపై నిప్పులు చెరిగారు. ఇక సీఎం కేసీఆర్ పార్టీ ఫిరాయింపులపై ఉన్న శ్రద్ధ తెలంగాణ ప్రజల ప్రాణాలపైనా లేదని రేవంత్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో వర్షాలు ఉన్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ సమీక్షలు జరపాల్సింది పోయి రాజకీయ అంశాలపై దృష్టి పెట్టారని రేవంత్ దుయ్యబట్టారు.

ఇక వర్షాలు కురిశాక చేపట్టాల్సిన సహాయక చర్యల్లో కూడా ప్రభుత్వం విఫలమైందన్నారు. వరదలతో 30 మంది చనిపోయినా కూడా వారి కుటుంబాలను పరామర్శించేందుకు సీఎం కేసీఆర్ ఎందుకు వెళ్లలేదని రేవంత్ ప్రశ్నించారు. ప్రజల ప్రాణాలపై కేసీఆర్ శ్రద్ధ లేదని ఎద్దేవా చేశారు. తాత్కాలిక సాయం కింద తెలంగాణకు రూ.1000 కోట్లను కేంద్రం రిలీజ్ చేయాలని రేవంత్ డిమాండ్ చేశారు. కేంద్రం నుంచి వరద సాయాన్ని తీసుకురావాల్సిన బాధ్యత కిషన్ రెడ్డిపై ఉందన్నారు. హైదరాబాద్ లో చిన్న చినుకు పడితే చిత్తడిలా మారుతుందని..భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణశాఖ చెబుతున్నా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు.

 

Latest Articles

అమెరికాలో హిందూ ఆలయంపై దాడి

         ఆలయంలో భక్తులు పూజలో మునిగిపోయారు. దైవ చింతనలో లీనమయ్యారు.. సరిగ్గా అదే సమయాన్ని అదునుగా  తీసుకున్నారు కొందరు దుండగులు. ఆలయాన్ని చుట్టుముట్టి.. ఇటుకలతో టార్గెట్‌ చేసి దాడికి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్