ఉపశమించిన కరోనా.. దేశంలో కొత్త కేసులు ఎన్నంటే?

Covid cases in India | దేశంలో కరోనా మహమ్మారి శాంతించింది. దేశంలో కరోనా​ కేసుల సంఖ్య భారీగా తగ్గింది. కొత్తగా దేశ వ్యాప్తంగా 5,537 కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా 11 మృత్యువాత పడ్డారు. గుజరాత్​లో ఇద్దరు చనిపోగా… ఛత్తీస్​గఢ్​, మహారాష్ట్ర, ఒడిశా, హిమాచల్​ ప్రదేశ్​, బిహార్​, ఉత్తర్​ ప్రదేశ్​లో ఒక్కొక్కరు మృతి చెందారు. దేశంలో కరోనా కారణంగా ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 5,30,965కు చేరగా.. యాక్టివ్ కేసుల సంఖ్య 32,814కు చేరింది. దేశంలో ఇప్పటివరకు మొత్తం 4,47,56,616 మందికి కరోనా​ సోకింది. రికవరీ రేట్​ 98.74 శాతంగా ఉంది. ఇక కరోనా టీకాల విషయానికొస్తే.. ఇప్పటివరకు 220.66 (220,66,22,663) కోట్ల కొవిడ్​ టీకాలు పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు. ఏదేమైనా ప్రజలంతా కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని.. ప్రజలు ఎక్కువగా గుమిగూడ ఉన్నచోట మాస్క్ తప్పనిసరిగా వాడాలని హెచ్చరించారు.

Latest Articles

‘మురసు తుఫాన్‌ ‘ పై సీఎం చంద్రబాబు సమీక్ష

కోస్తాంధ్ర తీరానికి అతి సమీపంలో ఉన్న మురసు తుఫాన్ ప్రభావం, ముందస్తు సన్నద్ధతపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. RTGS నుంచి అధికారులు, జిల్లాల కలెక్టర్లతో క్షేత్రస్థాయిలో చేపట్టిన ఏర్పాట్లపై సమీక్షించారు. తుఫాన్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్