పృథ్వీరాజ్ ‘ది గోట్ లైఫ్’ ఫస్ట్ లుక్ లాంచ్ చేసిన ప్రభాస్

మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్న కొత్త సినిమా “ది గోట్ లైఫ్” (ఆడు జీవితం). హాలీవుడ్ యాక్టర్ జిమ్మీ జీన్ లూయిస్, అమలాపాల్, కేఆర్ గోకుల్, అరబ్ ఫేమస్ యాక్టర్స్ తాలిబ్ అల్ బలూషి, రిక్ ఆబే ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. బెన్యామిన్ రాసిన గోట్ డేస్ నవల ఆధారంగా ఈ సినిమాను అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ బ్లెస్సీ రూపొందించారు. విజువల్ రొమాన్స్ బ్యానర్ “ది గోట్ లైఫ్” (ఆడు జీవితం) సినిమాను మలయాళ చిత్ర పరిశ్రమలో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ గా భారీ బడ్జెట్ తో నిర్మించింది. ఏప్రిల్ 10న “ది గోట్ లైఫ్” (ఆడు జీవితం) సినిమా పాన్ ఇండియా స్థాయిలో మలయాళంతో పాటు హిందీ, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది. ఇవాళ ఈ సినిమా నుంచి పృథ్వీరాజ్ సుకుమారన్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రిలీజ్ చేశారు. తన స్నేహితుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కు, “ది గోట్ లైఫ్” (ఆడు జీవితం) మూవీ టీమ్ కు ప్రభాస్ తన బెస్ట్ విశెస్ తెలియజేశారు.

ఈ సందర్భంగా పృథ్వీరాజ్ సుకుమారన్ మాట్లాడుతూ – నా ఫ్రెండ్ ప్రభాస్ చేతుల మీదుగా “ది గోట్ లైఫ్” (ఆడు జీవితం) ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసుకోవడం హ్యాపీగా ఉంది. ఈ ప్రాజెక్ట్ ఒప్పుకున్నప్పుడే ఈ సినిమా కోసం ఎంత కష్టపడాల్సి వస్తుంది అనేది నాకు తెలుసు. ఐదేళ్లు “ది గోట్ లైఫ్” (ఆడు జీవితం) సినిమా కోసం కేటాయించాను. మానసికంగా, శారీరకంగా నజీబ్ క్యారెక్టర్ లా మారిపోయాను. ఎన్నో సవాళ్లు ఎదుర్కొని ఈ మూవీ కోసం రాజీ లేకుండా కష్టపడ్డాను. “ది గోట్ లైఫ్” (ఆడు జీవితం) సినిమాకు పనిచేస్తున్నప్పుడు మేము ఎంతగా ఎంజాయ్ చేశామో, రేపు థియేటర్స్ లోనూ ప్రేక్షకులు కూడా అంతే హ్యాపీగా ఫీలవుతారు. అని చెప్పారు.

90వ దశకంలో జీవనోపాధి వెతుక్కుంటూ కేరళను వదిలి విదేశాలకు వలస వెళ్లిన నజీబ్ అనే యువకుడి జీవిత కథను వాస్తవ ఘటనల ఆధారంగా “ది గోట్ లైఫ్” (ఆడు జీవితం)లో చూపించబోతున్నారు. ఇది పూర్తిస్థాయిలో ఎడారిలో రూపొందుతున్న తొలి భారతీయ సినిమా కావడం విశేషం.

నటీనటులు – పృథ్వీరాజ్ సుకుమారన్, హాలీవుడ్ యాక్టర్ జిమ్మీ జీన్ లూయిస్, అమలాపాల్, కేఆర్ గోకుల్, అరబ్ యాక్టర్స్ తాలిబ్ అల్ బలూషి, రిక్ ఆబే తదితరులు

ఎడిటర్ – శ్రీకర్ ప్రసాద్
సినిమాటోగ్రఫీ – సునీల్ కేఎస్
సౌండ్ డిజైన్ – రసూల్ పూకుట్టి
మ్యూజిక్ – ఏఆర్ రెహమాన్
పీఆర్ ఓ – జీఎస్ కే మీడియా
నిర్మాణం – విజువల్ రొమాన్స్
దర్శకత్వం – బ్లెస్సీ

Latest Articles

నమో చారిత్రాత్మక విజయాలు

బీజేపీలో అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే నరేంద్ర మోదీ అద్భుతమైన వ్యూహకర్తగా పేరు తెచ్చుకున్నారు. 1987లో జరిగిన అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ ప్రచార బాధ్యతలను ఆయన భుజానికెత్తుకున్నారు. ఆ ఎన్నికల్లో...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్