26.6 C
Hyderabad
Sunday, March 1, 2026
spot_img

ఏపీ పోలీసుల విచారణకు రామ్‌గోపాల్‌వర్మ

సీఎం చంద్రబాబుపై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టిన కేసులో సినీ డైరెక్టర్ రాంగోపాల్ వర్మను పోలీసులు విచారించనున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్‌లో వర్మ విచారణ జరగనుంది. కేసు విచారణకు హాజరుకావాలంటూ ఆర్జీవీకి మద్దిపాడు పోలీసులు ఇటీవల నోటీసులు జారీ చేసారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఫోటోలు రాంగోపాల్ వర్మ మార్ఫింగ్ చేశాడని మద్దిపాడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది.

మార్ఫింగ్ చేసిన ఫోటోలు ఎక్స్ లో పోస్టు చేశాడని టీడీపీ మండల కార్యదర్శి రామలింగం మద్దిపాడు పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఈనెల 10న ఏడు సెక్షన్లతో రాంగోపాల్ వర్మపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా తనపై నమోదైన కేసు కొట్టేయాలని వర్మ హైకోర్టు‌ను ఆశ్రయించారు. విచారణ జరిపిన న్యాయస్థానం ఆ పిటిషన్‌ను తిరస్కరించింది. ఈ నేపథ్యంలో రాంగోపాల్ వర్మని ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్‌లో విచారించనున్నారు పోలీసులు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్