రంభ రీ ఎంట్రీ

90లలో సిల్వన్‌ స్క్రీన్‌ను షేక్‌ చేసిన అందాల భామ రంభ. కమర్షియల్‌ ట్రెండ్‌లో మంచి క్రేజ్‌ని సొంతం చేసుకున్న ఈ బ్యూటీ అప్పట్లో టాప్‌ స్టార్స్‌ అందరితోనూ స్క్రీన్‌ షేర్‌ చేసుకున్నారు. 2012 వరకు వరుస సినిమాలు చేసిన ఈ బ్యూటీ .. ఆ తర్వాత బ్రేక్‌ తీసుకున్నారు. ఇప్పుడు సిల్వర్‌ స్క్రీన్‌ రీ ఎంట్రీకి రెడీ అవుతున్న గ్లామర్‌ సునామీ.. కొత్త తరహా పాత్రలతో ఆడియెన్స్‌ను మెప్పించేందుకు రెడీ అవుతున్నారు.

90వ దశకంలో సిల్వర్‌ స్క్రీన్‌పై మెరిసిన రంభ.. నటనతో పాటు డ్యాన్స్‌తో ఆడియెన్స్‌కు దగ్గరయ్యారు. అందుకే దాదాపు దశాబ్దం పాటు సిల్వర్‌ స్క్రీన్‌ని రూల్ చేశారు. అప్పట్లో టాప్‌ స్టార్స్‌గా ఉన్న చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్‌తో పాటు జగపతిబాబు, జేడీ చక్రవర్తి లాంటి హీరోలతోనూ వరుస సినిమాలు చేసేసి స్టార్‌ ఇమేజ్‌ దక్కించుకున్నారు.

2000 తర్వాత టాలీవుడ్‌ మీద ఫోకస్ తగ్గించిన ఈ బ్యూటీ తమిళ ఇండస్ట్రీలో ఫామ్‌ చూపించారు. 2010లో పెళ్లి చేసుకున్న రంభ ఇండస్ట్రీకి పూర్తిగా దూరమైపోయారు. ఆ తర్వాత అడపాదడపా బుల్లితెర మీద కనిపించినా.. సినిమాల్లో మళ్లీ ఫామ్‌ చూపించలేదు. దాదాపు 15 ఏళ్ల తర్వాత సిల్వర్‌ స్క్రీన్‌ రీ ఎంట్రీకి రెడీ అవుతున్నారు రంభ.

రంభకు ముగ్గురు పిల్లలు. పిల్లలు కాస్త పెద్దవాళ్లు కావడంతో ఇప్పుడు మళ్లీ కెరీర్‌ మీద ఫోకస్‌ చేస్తున్నారు రంభ. నటిగా కొత్త తరహా పాత్రలు చేయాలని ఉంది అంటున్న ఈ బ్యూటీ అవకాశాల కోసం ఎదురుచూస్తున్నానని కన్‌ఫామ్‌ చేశారు. రీ ఎంట్రీలో రంభ ఎలాంటి క్యారెక్టర్లు సెలెక్ట్‌ చేసుకుంటారన్నదీ ఆసక్తికరంగా మారింది.

Latest Articles

మళ్లీ మొదలేట్టేసిన.. హిట్ మిషన్..

హిట్ మిషన్.. అనగానే ఠక్కున గుర్తొచ్చే డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఆయన డిఫరెంట్ గా ప్రమోట్ చేసినట్టుగా మరో డైరెక్టర్ ఎవరూ ప్రమోట్ చేయలేరు. ఇది నిజంగా నిజం. కొబ్బరికాయ కొట్టినప్పటి నుంచే.....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
347FollowersFollow
424,168SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్