స్వతంత్ర వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అనంతరం రాజకీయాలు వాస్తవ రూపాలను దాల్చడం స్టార్ట్ చేశాయని చెప్పాలి. చంద్రబాబును అరెస్ట్ చేయించింది వైసీపీనే అని టీడీపీ నేతలు అంటుంటే, ఇందులో మాకెలాంటి సంబంధం లేదు… తప్పు చేశాడు అరెస్ట్ అయ్యాడు అంటూ వైసీపీ నేతలు చెప్పుకుంటున్నారు. కాగా ఈ విషయం మీదనే బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి సైతం కక్ష సాధింపులో భాగంగానే అరెస్ట్ చేయించారన్నారు. తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి చేస్తున్న కామెంట్ లపై మండిపడ్డారు. ఈయన మాట్లాడుతూ పురందేశ్వరి టీడీపీకి అమ్ముడుపోయింది అంటూ కఠినమైన వ్యాఖ్యలు చేశాడు. చంద్రబాబుకు మీరు ఎంతకు అమ్ముడు పోయారు? మీకు చంద్రబాబు ఎంత ఇచ్చారు ? ఒక గౌరవమైన జాతీయ పార్టీలో ఉంటూ ఎలా ప్రాంతీయ పార్టీకి ఎందుకు అమ్ముడు పోయారు ? చంద్రబాబు అవినీతిలో మీకున్న వాటా ఎంత ? అంటూ విభిన్న రకాలుగా ప్రశ్నలను సంధిస్తూ పురందేశ్వరిని ఇరకాటంలో పడేశాడు ఎంపీ విజయసాయిరెడ్డి.
పురందేశ్వరి.. చంద్రబాబు అవినీతిలో మీకున్న వాటా ఎంత- వైసీపీ ఎంపీ
0
405
Previous article
Next article
Latest Articles
జనసేన ఓట్ల వ్యూహానికి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుండగా.. బీజేపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల...
- Advertisement -
- Advertisement -


