స్వతంత్ర వెబ్ డెస్క్: బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం పెట్రోల్ దాడిలో మృతిచెందిన విద్యార్థి అమర్నాథ్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణకు నిరసన సెగ తగిలింది.. ఎంపీ వచ్చిన సందర్భంగా గుంటూరు జిల్లా చెరుకు పల్లిలో ఉద్రిక్తత నెలకొంది.. మోపిదేవిని అడ్డుకున్న గ్రామస్తులు.. హత్య చేసిన నలుగురికి ఇక్కడే శిక్ష వేయాలని కుటుంబ సభ్యుల డిమాండ్ చేశారు. అయితే, ప్రభుత్వం నుంచి నష్టపరిహారం, అంగన్‌వాడీ ఉద్యోగం ఇప్పిస్తానని హామీ ఇచ్చారు మోపిదేవి.. కానీ, నిందితులకు ఇక్కడే శిక్ష పడాలంటూ ఎంపీని అడ్డుకున్నారు కుటుంబ సభ్యులు.. ఎంపీ గో బ్యాక్, ఎంపీ డౌన్ డౌన్ అంటూ మృతుని బంధువుల నినాదాలు చేయడంతో.. ఒక్కసారిగి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అయితే ఈ రోజు ఉప్పలవారిపాలెంలో అమర్నాథ్ అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ క్రమంలో ప్రజాసంఘాలు, వివిధ పార్టీలకు చెందిన నేతలు కూడా రానుండడంతో ముందస్తు చర్యల్లో భాగంగా పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు.